పగలు ఎండ... రాత్రి చలి

2 Feb, 2017 23:42 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : వాతావరణం మారింది. కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో రాత్రిళ్లు చలి కొనసాగుతుండగా మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రత కనిపిస్తోంది. గురువారం అగళి మండలంలో కేవలం 9.5 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా కొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 36 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. అగళితో పాటు తనకల్లు 10.3 డిగ్రీలు, మడకశిర 10.4, రొద్దం 10.8, అమరాపురం 11.9, గాండ్లపెంట 12, చెన్నేకొత్తపల్లి 12.3, కనగానపల్లి 12.3, గుమ్మగట్ట 12.6, ఎన్‌పీ కుంట 12.6, తలుపుల 12.9  కనిష్టం నమోదు కాగా మిగతా మండలాల్లో 13 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

ఇక పగటి ఉష్ణోగ్రతల విషయానికి వస్తే పలు మండలాల్లో 35 నుంచి 36 డిగ్రీలు నమోదు కావడంతో ఎండ తీవ్రత పెరిగింది. ఇందులో కొన్ని మండలాల్లో కనిష్టం, గరిష్టం రెండూ నమోదు కావడం విశేషం. గాలిలో తేమ శాతం ఉదయం 67 నుంచి 87 శాతం, మధ్యాహ్న సమయంలో కేవలం 10 నుంచి 20 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మొత్తమ్మీద ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు చురుగ్గా ఉండటంతో మున్ముందు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండతీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు