యాచక రహిత నగరమే ధ్యేయం

10 Dec, 2016 23:02 IST|Sakshi
యాచక రహిత నగరమే ధ్యేయం

ఎల్‌బీనగర్‌: బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేశామని మేయర్‌ బొంతు రాంమోహన్ తెలిపారు. ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ అమ్మానాన్న అనాథాశ్రమం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బెగ్గర్‌ ఫ్రీ సిటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ మతిస్థిమితం లేని వారికి  సేవలు చేస్తున్న అమ్మానాన్న ఫౌండేషన్  చైర్మన్ గట్టు శంకర్‌ను అభినందించారు.

ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి మాట్లాడుతూ బెగ్గర్స్‌ పునరావాసానికి గ్రేటర్‌ పరిధిలో ప్రణాళికలు సిద్ధం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బిచ్చగాళ్ల నిర్మూలనకు తాను మేయర్‌గా ఉన్న సమయంలో అనేక ప్రయత్నాలు చేశానన్నారు. ఈస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ రఘుప్రసాద్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో మానసిక వికలాంగులు, నిజమైన బెగ్గర్‌లను గుర్తించి అమ్మానాన్న ఫౌండేషన్ కు అప్పగిస్తామన్నారు.

కార్యక్రమంలో వినోద్‌కోట్ల, యూసీడీ అడిషనల్‌ కమిషనర్‌ భాస్కరాచారి, డీసీలు పంకజ, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, సామ రమణారెడ్డి, అనితా దయాకర్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, రమావత్‌ పద్మానాయక్, రాధా ధీరజ్‌రెడ్డి

 

మరిన్ని వార్తలు