మిషన్‌ కాకతీయతో నిండిన చెరువులు

27 Sep, 2016 21:27 IST|Sakshi
మిషన్‌ కాకతీయతో నిండిన చెరువులు
హుజూర్‌నగర్‌ :  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేసిన మిషన్‌ కాకతీయ పథకం వల్లనే నేడు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు జలకళ సంతరించుకున్నాయని గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పోచమ్మ చెరువు అలుగు వద్ద అర్చకుల మంత్రోచ్ఛరణాల  మధ్య గంగాహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏనాడు కనీసం మరమ్మతులకు నోచుకోని చెరువులు, కుంటలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిషన్‌ కాకతీయను ప్రవేశపెట్టారన్నారు.  ఈ కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌పట్టణ అధ్యక్షుడు దొడ్డా నర్సింహారావు, అర్చకులు దామోదచార్యులు, పాస్టర్‌ ఇస్మాయిల్, నాయకులు శీలం వీరయ్య, ఎండి.లతీఫ్, రాయల వెంకటేశ్వర్లు, కొండేటì  శ్రీను, పెదలక్ష్మీనర్సయ్య, రామలక్ష్మమ్మ, అన్నపూర్ణ, శిల్ప శ్రీను, వి.వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు