నేడు ఎంసెట్..

15 May, 2016 06:16 IST|Sakshi

 నల్లగొండ టూ టౌన్ : జిల్లాలోని నల్లగొండ, కొదాడ పట్టణాల్లో ఆదివారం నిర్వహించే ఎంసెట్‌కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్నీ పరీక్ష కేంద్రాల్లోని సెంటర్లలో విద్యార్థులకు నెంబర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండాముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు.
 
  ఎంసెట్ కోసం జిల్లా కేంద్రంలో  15 సెంటర్లు, కోదాడలో 8 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారు. అభ్యర్థులు పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్ష హాల్‌లోనే ఉండాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను శనివారం ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్లు రావుల నాగేదంర్‌రెడ్డి, ధర్మానాయక్ పరిశీలించారు. ఆయా సెంటర్లలో ఏర్పాట్లపై ఆరా తీశారు.
 

మరిన్ని వార్తలు