‘జనగామ’ కోసం నేడు చండీయాగం

22 Sep, 2016 01:04 IST|Sakshi
జనగామ : జనగామ జిల్లా సాధన కోసం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నేడు జ్వాలా సుదర్శన నారసింహ సహిత చండీయాగం నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రెయిన్‌మార్కెట్‌ ఆవరణలోని కవర్‌ షెడ్‌ ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు చండీయాగం ప్రారంభం అవుతుందని తెలి పారు. మొదట గణపతి పూజ, స్వస్తి పుణ్యా హ వచనం, రుత్వికరణము, ఆ తర్వాత విజయగణపతి, చండీ హోమాలు, రుద్రహోమం, మన్యసూక్త హోమం, సుదర్శన నారసింహ, పంచసూక్త హోమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
 
మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాహుతితో ముగింపు పలుకుతారన్నారు. అనంతరం మహా అన్నదానం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో నాయకులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, డాక్టర్లు లకీనారాయణ నాయక్, రాజమౌళి, ఆకుల వేణుగోపాల్‌రావు, మేడ శ్రీనివాస్, మాశెట్టి వెంకన్న, జక్కుల వేణుమాధవ్, మంగళ్లపల్లి రాజు, రెడ్డి రత్నాకర్, ఆలేటి సిద్ధిరాములు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు