రేపు ఒంగోలులో కిమ్స్‌ ఆస్పత్రి ప్రారంభం

31 May, 2017 23:37 IST|Sakshi

ఒంగోలు సెంట్రల్‌ : ఒంగోలులోని నూతనంగా నిర్మించిన కిమ్స్‌ వైద్యశాలను జూన్‌ 1వ తేదీన కేంద్ర అర్బన్‌ అభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. మొత్తం 2150 పడకలతో 30 ప్రత్యేక విభాగాలతో ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో గుండె, కిడ్నీ, నరాలు, యూరాలజీ, ఊపిరితిత్తులు, కంటి, చెవి, పళ్లు తదితర విభాగాలలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, ఎంఆర్‌ఐ స్కాన్, క్యాత్‌ ల్యాబ్‌ తదితర ప్రత్యేక విభాగాలును ఏర్పాటు చేశారు.   

కిమ్స్‌కు ఎన్‌ఎబిల్, ఎన్‌ఎబిహెచ్‌ గుర్తింపు ఉంది. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వై.సుజనాచౌదరి, శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు డాక్టర్‌ కామినేని శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు,  డాక్టర్‌ పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, జడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు తదితరులు పాల్గొంటారు.

>
మరిన్ని వార్తలు