జీడిపల్లి రిజర్వాయర్‌లో పూర్తిగా తగ్గిన నీటి మట్టం

6 Aug, 2017 21:48 IST|Sakshi
జీడిపల్లి రిజర్వాయర్‌లో పూర్తిగా తగ్గిన నీటి మట్టం

బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌లో రోజురోజుకూ నీటి మట్టం తగ్గుతోంది. జీడిపల్లి రిజర్వాయర్‌కు 1.68 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం వుంది. ప్రస్తుత కరువు సమయంలో కొద్ది వరకు పీఏబీఆర్‌ డ్యాంకు నీటిని అందించి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తాగునీటి అవసరాలకు వాడుతున్నారు. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలోని కొన్ని చెరువులకు,  ధర్మవరం, బుక్కపట్నం చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్‌లోని నీటిని తరలించారు.

ప్రస్తుతం జీడిపల్లి రిజర్వాయర్‌లో కేవలం 0.35 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు పరిధిలోని 36వ ప్యాకేజీ పనులు పూర్తయితే సాగునీటి కోసం రిజర్వాయర్‌లోని నీటి నిల్వల మొత్తంను సైతం తీసుకునే అవకాశం  ఉంటుందని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌డీఈ మురళీధర్‌రెడ్డి అన్నారు. అయితే 36వ ప్యాకేజీ ఆయకట్టుకు సాగునీటిని ప్రభుత్వం అందించకపోవడం మూలంగా రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గుతోంది.  సమీపంలోని బోరుబావుల్లో సైతం నీటి లభ్యత తగ్గుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు