డెల్టాకు నీరు నిలిపివేత

28 Aug, 2016 00:45 IST|Sakshi
డెల్టాకు నీరు నిలిపివేత
 
  సోమశిల:
సోమశిల జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు విడుదలవుతున్న నీటిని శనివారం అధికారులు నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ దేశ్‌ నాయక్‌ మాట్లాడుతూ జలాశయం నుంచి 2500 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్న నేపథ్యంలో డెల్టా ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు నీటిని నిలిపామన్నారు. రెండో పంటకు సెప్టెంబర్‌ 15 తేదీ వరకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 23.5 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఇంకా 4 టీఎంసీల వరకు ఇవ్వాల్సి ఉందన్నారు. పెతట్టు  ప్రాంతాల నుంచి జలాశయానికి 569 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 7.365 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. జలాశయంలో 82.156 మీటర్లు, 269.54 అడుగు మట్టం నీటి మట్టం ఉందన్నారు.
మరిన్ని వార్తలు