వర్షిణి కుటుంబానికి అండగా ఉంటాం..

3 Sep, 2016 00:06 IST|Sakshi
వర్షిణి భర్త వెంకటరమణను ఓదార్చుతున్న మందకృష్ణ
కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని కుడికిళ్లకు చెందిన వర్షిణిపై సామూహిక అత్యాచారం బాధాకరమని మాదిగ హక్కుల పోరాట సమితి(ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం మండలంలోని కుడికిళ్లలో మృతురాలు వర్షిణి కుటుంబాన్ని ఆయన పరామర్శించి భర్తతో పాటు కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్‌చేసి, మిగతావారిని తప్పించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. వైశ్యకులంపై చులకనభావమే ఈ అత్యాచారానికి కారణమైందన్నారు. ఈ కేసులో మంత్రి జూపల్లి కొందరిని తప్పించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే నిర్భయ చట్టం ప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వైశ్య సమాజానికి ఎమ్మార్పీఎస్‌ పూర్తిగా అండగా ఉంటుందని, వారు చేసే ప్రతి ఆందోళనకు మద్దతిస్తామన్నారు. ఈ కేసులో ఎసై ్స నుంచి డీఎస్పీ వరకు మంత్రి జూపల్లి మాటలు విన్నట్లుగా కనిపిస్తుందన్నారు. రెండు రోజుల్లో డీజీపీ, హోం మంత్రిని కలిసి దోషులకు శిక్ష పడే విధంగా కషిచేస్తామన్నారు. ఈ కేసుపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వారంరోజులపాటు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.      
      జిల్లాలో కలెక్టర్, ఎస్పీ మహిళలు ఉన్నత పదవిలో ఉన్నా వర్షిణి మతిపై సానుభూతి కూడా చూపి పరామర్శించకపోవడం విడ్డూరమన్నారు. వారు ఆ పదవుల్లో ఉండేందుకు అనర్హులన్నారు. కార్యక్రమంలో జాతీయ దండోరా నాయకులు కోళ్ల వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు కోళ్ల శివ, మంద నర్సింహ్మ, టైగర్‌ జంగయ్య, మంగి విజయ్, తాలుకా ఇన్‌చార్జి నాగులపల్లి లక్ష్మయ్య, జిల్లా నాయకులు అగ్రస్వామి, రాజమౌలి, వడ్డెమాన్‌ రాముడు, సన్నయ్య, పుట్టపాగ రాముడు, పత్తి కురుమూర్తి, సహదేవుడు, బోరెల్లి కష్ణయ్య, తోలు రాముడు, వీరపాగ చంద్రశేఖర్, శంకర్‌నాయుడు, వర్షిణి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు