రేడియో ధార్మిక ఔషధాల పరిశోధనకు ప్రాధాన్యం

10 Sep, 2016 01:15 IST|Sakshi
రేడియో ధార్మిక ఔషధాల పరిశోధనకు ప్రాధాన్యం
 
  •  వీఎస్‌యూ వీసీ వీరయ్య
నెల్లూరు (టౌన్‌):
రేడియో ధార్మిక ఔషధాల పరిశోధనలకు ప్రాధన్యం ఇవ్వాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్‌ వీరయ్య తెలిపారు. వర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం న్యూ క్లియర్‌ కెమిస్ట్రీ అండ్‌ అప్లికేషన్స్‌ ఆఫ్‌ రేడియో ఐసోటోప్స్‌పై రెండు రోజుల జాతీయ వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పరిశోధనలను బాబా అటామిక్‌ రీసోర్స్‌ సెంటర్, ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ కెమిస్ట్రీ అండ్‌ అల్లైడ్‌ సైంటిస్ట్, ఇంధిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్‌ నుంచి వచ్చిన శాస్త్రవేత్తల నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. న్యూ క్లియర్‌ కెమిస్ట్రీ ఆవిష్కరణకు హె న్రీ బెకరల్, క్యూరీ లాంటివారు గట్టి పునాదులు వేశారని చెప్పారు. పశ్చిమ దేశాల్లో వ్యవసాయంలో వస్తున్న పెనుమార్పులుకు పరిశోధనలే కారణమన్నారు. రిజిస్ట్రార్‌ శివశంకర్‌ మాట్లాడుతూ నేడు ప్రాకృతిక శిలాజ వనరులను కాపాడుకోవాలంటే అసంప్రాదాయక శక్తి వనరులైన అణుధార్మిక శక్తిని వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అణుశక్తి ఉపయోగంతో తీవ్ర మానవ రుగ్మతల నివారణ, మానవ వికాసాన్ని పొందవచ్చన్నారు. ముంబైకు చెందిన బాబా అటామిక్‌ రీసోర్స్‌ సెంటర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఏవీ రమణారెడ్డి మాట్లాడుతూ అణుశక్తి ఆధునిక పరిశోధనలు క్యాన్సర్‌ నివారణకు, రోగ నిర్ధారణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.  ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ కెమెస్ట్రీ అండ్‌ అల్లైడ్‌ సైంటిస్ట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సుబ్రహ్మణి రేడియోధార్మిక మూలకాలైన కోబాల్ట్, బిస్మత్‌ లాంటి పదార్థాలను పలు ప్రయోగాల్లో ఉపయోగిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటరావు, కెమిస్ట్రీ విభాగాధిపతి విజయ, త్రివేణి, వీరారెడ్డి, వర్సిటీ ఆచార్యులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు