ఇంటర్వ్యూలో తొందరపడితే కష్టమే..

25 Sep, 2016 08:56 IST|Sakshi
ఇంటర్వ్యూలో తొందరపడితే కష్టమే..

వ్యక్తిత్వవికాస నిపుణుడు యండమూరి


విజయవాడ : ఇంటర్వ్యూల్లో తొందరపడితే నష్టమేనని, ఆలోచించి సరైన సమాధానాన్ని స్పష్టంగా చెప్పాలని నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ యువజనోత్సవాల్లో భాగంగా ఇంఫాక్ట్ పేరుతో మొగల్రాజపురం పి.బి.సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం వ్యక్తిత్వ వికాస శిక్షణ  తరగతులు నిర్వహించారు.
 
 ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావడం ఎలా అనే అంశంపై వారికి అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపైన కనీస జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషిలోని భయం అనే శత్రువును పారదోలాలని, అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలమనే ధైర్యం వస్తోందన్నారు.
 
 వ్యక్తిత్వ వికాస నిపుణులు, టీవీ సీరియల్ నటుడు ప్రదీప్ మాట్లాడుతూ మనం కన్న కలలను నిజం చేసుకోవాలంటే పొలంలో విత్తనాలు చల్లి సాగు చేసిన విధంగా కష్టపడాలని సూచించారు. మానసిక వైద్య నిపుణడు గంపా నాగేశ్వరరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు జయసింహ, వేణుగోపాల్, విశ్వనాథం, రత్నాకర్  మాట్లాడారు.   డెరైక్టర్ పార్థసారథి, శివశంకర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు