‘ఈనాడు’ కూడా జీజేఆర్ మానసపుత్రికే.

5 May, 2014 00:39 IST|Sakshi
‘ఈనాడు’ కూడా జీజేఆర్ మానసపుత్రికే.

రామోజీ చురుకుదనాన్ని గమనించిన జీజేఆర్ ఆయనకు క్రమక్రమంగా ప్రాధాన్యం కల్పించారని అప్పటి సహోద్యోగులు వివరించారు. ఈ క్రమంలోనే రామోజీని ముందు పెట్టి మార్గదర్శికి జీజేఆర్ శ్రీకారం చుట్టారని, తర్వాత 1963లోనే రామోజీతో ‘ఎలైట్’ అనే సాయంకాలం దినపత్రిక (ఇంగ్లిష్) కూడా పెట్టించారని చెబుతారు. అప్పటికే మార్గదర్శిలోనూ, ఆ తర్వాత రామోజీ పెట్టిన డాల్ఫిన్ హోటళ్లలోనూ జీజేఆర్ పెట్టుబడులే ప్రధానంగా ఉన్నాయి. అనంతర కాలంలో ఈనాడు’ పత్రిక పుట్టుకొచ్చింది కూడా జీజేఆర్ ఆలోచనల్లో నుంచేనని ఆయన సన్నిహితులు వెల్లడించారు. 1974లో రామోజీ ‘ఈనాడు’ పెట్టేనాటికి ఢిల్లీలో జీజేఆర్ పలుకుబడి పతాక స్థాయిలో ఉంది. ఆ పత్రికకు ఆయనే ఆర్థిక సాయం చేశారని జీజేఆర్ సన్నిహితులు వివరించారు.

‘‘ఈనాడుకు ప్రింటింగ్ ప్రెస్ కూడా జీజేఆర్ చలవే. కమ్యూనిస్టు కార్డును పూర్తిస్థాయిలో ఉపయోగించి తూర్పు జర్మనీ నుంచి సెకండ్ హ్యాండ్ ముద్రణా సామగ్రి మొత్తాన్నీ ఈనాడుకు సాధించి పెట్టారు జీజేఆర్. ఆ రుణాన్ని ఏడేళ్ల పాటు సులభ వాయిదాల్లో చెల్లించే ఏర్పాటు కూడా చేయించారు. ఇలా తొలినాళ్లలో రామోజీ పెట్టిన సంస్థల పునాదులన్నీ పూర్తిగా జీజేఆర్ వేసినవే’’ అని వివరించారు. అంతేకాదు, ‘‘రామోజీ ఒకట్రెండుసార్లు నా సమక్షంలోనే జీజేఆర్ దగ్గరికి డబ్బుల కోసం వచ్చి వెళ్లాడు. అది రామోజీకి నిత్యకృత్యమేనని ఆ తర్వాత జీజేఆర్ నాతో చెప్పారు’’ అని జీజేఆర్‌కు అతి సన్నిహితుడైన ఓ ప్రముఖ వ్యక్తి కూడా సాక్షి ప్రతినిధికి వివరించారు.
 
 

మరిన్ని వార్తలు