పదితో ప్రభుత్వ ఉద్యోగాలివిగో..

29 Apr, 2016 04:15 IST|Sakshi
పదితో ప్రభుత్వ ఉద్యోగాలివిగో..

 ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి.. సుస్థిర కెరీర్ సొంతం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ సంవత్సరాల పాటు ఉన్నత విద్యను అభ్యసించే పరిస్థితులు అందరికీ ఉండకపోవచ్చు. అలాంటి వారు పదో తరగతి అర్హతతోనే కొలువులో చేరే వీలుంది. అది కూడా సర్కారీ నౌకరీ! ఆ ప్రభుత్వ ఉద్యోగాలేమిటో... వాటిని సాధించడమెలాగో తెలుసుకుందాం!!  
 
 కేంద్ర ప్రభుత్వ కొలువులు

 ఇండియన్ రైల్వేస్‌లో
 పోస్టులు: ఇండియన్ రైల్వే డిపార్ట్‌మెంట్ గ్రూప్-డి హోదాతో..  టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లోని ట్రాక్‌మన్, ఖలాసి, పాయింట్స్‌మన్, గేట్‌మన్, హెల్పర్..
 వెబ్‌సైట్:www.rrbsecunderabad.nic.in
 
 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్స్
 వయసు: 18 నుంచి 25
 నియామకం: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష
 వెబ్‌సైట్: www.rpfonlinereg.in
 
 పోస్టల్ శాఖలో పోస్ట్‌మెన్, మెయిల్ గార్డ్
 వయసు: 27 ఏళ్ల లోపు ఉండాలి.
 నియామకం: ఆయా రాష్ట్రాలను సర్కిళ్లుగా
 విభజించి సర్కిళ్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
 
 ఆర్మీలో ఉద్యోగాలు
 పోస్టులు: సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్‌‌సమన్, నర్సింగ్ అసిస్టెంట్.
 వయసు: 16 నుంచి 21 ఏళ్లు
 ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌లలో ప్రతిభ
 
 బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్స్
 ఎంపిక:  ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షలో ప్రతిభ
 వెబ్‌సైట్: www.bsf.nic.in
 
 అభ్యర్థులు చూడాల్సిన వెబ్‌సైట్లు
 ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
 వెబ్‌సైట్: www.itbpolice.nic.in
 వెబ్‌సైట్: www.cisf.gov.in
 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
 వెబ్‌సైట్: www.crpf.nic.in
 మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్
 వెబ్‌సైట్: www.mes.gov.in
 
 రాష్ట్ర ప్రభుత్వంలో..
  ఆర్టీసీ.. బస్ డ్రైవర్లు, కండక్టర్లు
   అర్హత: హెవీ వెహికిల్ డ్రైవింగ్ లెసైన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
  అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
  ఎంపిక: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా.
 విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)
   పోస్టులకు కూడా టెన్‌‌త క్లాస్ ఉత్తీర్ణులు అర్హులే.
 
 రాష్ట్ర స్థాయిలో జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సబ్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో సూపర్‌వైజర్, మ్యాట్రన్ పోస్ట్‌లను కూడా పదో తరగతి అర్హత ఆధారంగా భర్తీ చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో సర్వీస్ కమిషన్ గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా నియామకం చేపడతారు.
 

మరిన్ని వార్తలు