భారత జాతీయోద్యమం

14 Feb, 2014 00:02 IST|Sakshi
భారత జాతీయోద్యమం

ప్రాచీన సంతతికి చెందిన మానవుల సముదాయాన్ని ‘జాతి’ అని పిలుస్తారు.
     భారతదేశంలో జాతీయ భావాలు వ్యాపించడానికి కారణమైనవారు  ఆంగ్లవిద్య అభ్యసించిన భారతీయులు.
     సురేంద్రనాథ్ బెనర్జీ కలకత్తాలో ‘ఇండియన్ అసోసియేషన్’ను నెలకొల్పారు.

     ‘భారత జాతీయ కాంగ్రెస్’ 1885లో బొంబాయిలో ఎ.ఒ. హ్యూమ్ అనే విశ్రాంత బ్రిటిష్ అధికారి కృషి వల్ల ఏర్పడింది.
     మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ (1885 డిసెంబర్) సమావేశంలో 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఉమేష్‌చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించాడు.

     భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రను మూడు దశలుగా విభజించారు.
 1.     మితవాద యుగం(1885-1905)
 2.     అతివాద యుగం(1905- 1919)
 3.     గాంధీ యుగం(1919-1947)
     మితవాద నాయకుల పోరాటం ‘ప్రార్థన, అభ్యర్థన, నిరసన’ పద్ధతిలో ఉండేది. వీరి కోరికలు మితంగా ఉండేవి.
     అతివాదుల్లో ముఖ్యులు: బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్‌చంద్రపాల్.

 బెంగాల్ రాష్ట్రాన్ని 1905లో గవర్నర్ జనరల్ లార్‌‌డ కర్జన్ రెండుగా విభజించాడు. బ్రిటిషర్ల ఉద్దేశం హిందూ, ముస్లింలను విభజించడం.
 బెంగాల్ విభజనకు నిరసనగా అక్కడి హిందువులు, ముస్లింలు ఐక్యతకు చిహ్నంగా ఒకరికొకరు రాఖీలు కట్టు కున్నారు.
 స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం వందేమాతరం ఉద్యమం ముఖ్య లక్షణాలు.
     బెంగాల్ విభజనకు నిరసనగా 1905లో ‘వందేమాతరం ఉద్యమం’ ప్రారంభమైంది.
     ‘వందేమాతరం’  గేయాన్ని బంకించంద్ర ఛటర్జీ రాశారు.
     ముస్లింలీగ్ 1906లో ఏర్పడింది. దీని ఏర్పాటుకు వైస్రాయ్ మింటో ప్రోత్సహించాడు.

 1909 చట్టం సంస్కరణలను మింటో-మార్లే సంస్కరణలు అంటారు. వీటి ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు.

 బెంగాల్ విభజన రద్దును 1911లో ఇంగ్లండ్ రాజు 5వ జార్జి భారతదేశానికి వచ్చి ప్రకటించాడు. దాంతో వందేమాతరం ఉద్యమం ముగిసింది. అదే రోజు భారత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటించారు.

     మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమైంది.
     వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నందుకు బాలగంగాధర్ తిలక్‌ను 1908 నుంచి 1914 వరకు జైల్లో నిర్బంధించారు.
     హోంరూల్ అంటే స్వపరిపాలన.
     ఐర్లాండ్‌కు చెందిన అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజ ప్రచారం కోసం భారతదేశానికి వచ్చి మద్రాస్ రాష్ర్టంలో      స్థిరపడింది. 1915లో హోంరూల్ లీగ్‌ను స్థాపించింది.
     తిలక్ 1916లో పుణేలో మరో హోంరూల్ లీగ్‌ను స్థాపించారు. చిత్తరంజన్‌దాస్, మో తీలాల్‌నెహ్రూ ఈ ఉద్యమాన్ని బలపరిచారు.
     హోంరూల్ ఉద్యమ కాలంలోనే తిలక్ ‘స్వరాజ్యమే నా జన్మహక్కు’ అని నినాదం చేశాడు.
     అతివాద ఉగ్రవాద కార్యకలాపాలు మహారాష్ర్ట, బెంగాల్‌లో ఎక్కువగా జరిగేవి.
     అతివాద విప్లవకారులు వైస్రాయ్ లార్‌‌డ హార్డింజ్‌పై బాంబు దాడి చేశారు.

 భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు 1916లో ‘లక్నో ఒడంబడిక’పై సంతకం చేశాయి. భారత స్వపరిపాలన సాధనకు, ఉమ్మడి పోరాటానికి సన్నద్ధమయ్యాయి.
తొలిసారిగా భారతదేశంలో స్వపరిపాలన ప్రవేశపెడతామని 1917లో బ్రిటిష్ భారత వ్యవహారాల మంత్రి ‘మాంటేగ్’ ప్రకటించాడు.
     దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ 1915లో
      భారతదేశానికి తిరిగివచ్చారు.
 హిందూ మహాసభ 1915లో ఏర్పడింది.

 ‘తీన్‌కథియా పన్ను’కు వ్యతిరేకంగా చంపారన్(బీహార్) రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా గాంధీ 1917లో సత్యాగ్రహ పోరాటం చేసి విజయం సాధించారు.
 1918లో అహ్మదాబాద్‌లో నూలు మిల్లు కా ర్మికుల వేతనాల పెంపునకు చేస్తున్న పోరాటానికి గాంధీ నాయకత్వం వహించారు.
 గుజరాత్‌లో ‘కైరా’ ప్రాంత రైతులు పంటలు పండలేని కారణంగా శిస్తు కట్టడాన్ని మాఫీ చేయాలని పోరాటం చేశారు. వారి తరఫున గాంధీ సత్యాగ్రహం చేసి బ్రిటిషర్లను ఒప్పించారు.
‘సత్యాగ్రహం’ అంటే నిజాన్ని అంటిపెట్టుకొని ఉండటం.
 1919లో రౌలత్ చట్టాన్ని చేశారు. దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఏ భారతీయుడినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా కారణం చెప్పకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు.
 రౌలత్ చట్టాన్ని భారతీయులు నల్ల చట్టంగా పేర్కొన్నారు. ఈ చట్టానికి నిరసనగా 1919 ఏప్రిల్ 6న దేశ వ్యాప్తంగా ‘జాతిని అవమానించిన దినం’గా పాటించి నిరసన తెలియజేయాలని  గాంధీజీ పిలుపునిచ్చారు.
 రౌలత్ చట్టానికి, సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూ అరెస్ట్‌లకు నిరసనగా ప్రజలు అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ అనే తోటలో 1919 ఏప్రిల్ 13న సమావేశమయ్యారు.
 ఆంగ్లేయాధికారి  మైకేల్ ఓ డయ్యర్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే అక్కడి ప్రజలపై కాల్పులు జరిపించాడు. ఈ దురంతానికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు బ్రిటిషర్లు  ఇచ్చిన బిరుదును త్యజించాడు.
 మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోయిన కారణంగా బ్రిటిషర్లు టర్కీ సుల్తాన్ ఖలీఫా పదవిని రద్దు చేశారు. దాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది.
     ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముఖ్య నాయకులు: అబుల్ కలామ్ ఆజాద్, హజ్రత్ మెహనీ.
     జాతీయోద్యమ కాలంలో  అక్టోబరు 17న ‘ఆల్ ఇండియా ఖిలాఫత్ డే’ను  నిర్వహిం చేవారు.
     నాగ్‌పూర్ సమావేశం (1920)లో సహాయనిరాకరణోద్యమం చేపట్టాలని  భారత జాతీయ కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి గాంధీజీ అధ్యక్షత వహించారు.

సహాయనిరాకరణోద్యమం ముఖ్య కార్యక్రమాలు: బ్రిటిషర్లు ఇచ్చిన బిరుదులను త్యజించడం; బ్రిటిషర్ల విద్యాలయాలు, న్యాయస్థానాలను బహిష్కరించడం; ప్రభు త్వ ఉద్యోగాలకు రాజీనామా చేయడం.

     సహాయనిరాకరణోద్యమంలో భాగంగా గాంధీజీ బ్రిటిషర్లు తనకిచ్చిన ‘కైజర్-ఎ-హింద్’ బిరుదును త్యజించారు.
     కేరళలో మోప్లా తిరుగుబాటు జరిగింది.

ఫిబ్రవరి 5, 1922లో చౌరీచౌరా సంఘటన(ఉత్తరప్రదేశ్)  జరిగింది. దీంతో గాంధీజీ సహాయనిరాకరణోద్యమాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు.

     1923లో స్వరాజ్యపార్టీ స్థాపించారు.
     1919 చట్టం సంస్కరణలను మాంటేగ్-ఛెమ్స్‌ఫర్‌‌డ సంస్కరణలుగా పిలుస్తారు.
 సహాయనిరాకరణోద్యమం ఆగిపోయిన తర్వాత కూడా శాసనసభ బహిష్కారాన్ని కొనసాగించాలని సి. రాజగోపాలచారి పట్టుబట్టారు.
 సి. రాజగోపాలచారి నిర్ణయాన్ని వ్యతిరేకించిన  వారు భారత జాతీయ కాంగ్రెస్‌లో అంతర్భాగంగా కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీని స్థాపించారు.
కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీని ‘స్వరాజ్య పార్టీ’గా పిలుస్తారు. దీనికి అధ్యక్షులుగా చిత్తరంజన్‌దాస్, కార్యదర్శిగా మోతీలాల్ నెహ్రూ వ్యవహరించారు.

     సచిన్ సన్యాల్, జోగేష్ ఛటర్జీ
     ‘హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్’ను స్థాపించారు.
     రాంప్రసాద్ బిస్మల్(ఉత్తర ప్రదేశ్) కాకోరి కుట్ర కేసులో ప్రధాన నిందితుడు.
     కాకోరి కుట్ర కేసు నుంచి తప్పించుకున్న ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్.
 హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీని 1928లో స్థాపించారు. దీనిలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ ముఖ్య నాయకులు.
 1919 చట్టం సంస్కరణల అమలును అధ్యయనం చేయడానికి సైమన్ అనే ఆంగ్లేయాధికారి అధ్యక్షతన ఒక కమిషన్‌ను 1927లో వేశారు. భారతీయులు సభ్యులుగా లేనందున ప్రజలు ఆ కమిషన్‌ను బహిష్కరించారు.

 సైమన్ కమిషన్ ‘లాహోరు’కు వచ్చినప్పుడు ‘సైమన్ గో బ్యాక్’ నిరసనలో సాండర్సు అనే పోలీస్ లాఠీ దెబ్బలతో లాలాలజపతిరాయ్ మరణించాడు.
     సాండర్‌‌సను భగత్‌సింగ్ హత్య చేసి లాహోర్ కుట్ర కేసులో ప్రధాన దోషి అయ్యాడు.
 భగత్‌సింగ్, బతుకేశ్వర్ దత్‌లు న్యూఢిల్లీలోని అసెంబ్లీలో ఏప్రిల్ 8, 1929లో బాంబు దాడి చేశారు. ఆ సమయంలోనే భగత్‌సింగ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదించాడు.
     సైమన్ కమిషన్ తొలిసారిగా భారతదేశాన్ని (బొంబాయి) ఫిబ్రవరి 3, 1928న సందర్శించింది.
     1930 నుంచి ఏటా జనవరి 26న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
 గాంధీజీ ‘దండియాత్ర’ను 1930 మార్చి 12న ప్రారంభించారు. దీన్ని సబర్మతి ఆశ్రమం (అహ్మదాబాద్)  నుంచి ప్రారంభించారు.
గాంధీజీ 1930 ఏప్రిల్ 6న  దండి గ్రామం చేరుకున్నారు. అదే రోజున ఉప్పు శాసనాలను ఉల్లంఘించి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని కూడా అదే రోజున ప్రారంభించారు.

     రాజగోపాలచారి దక్షిణ భారతదేశంలో తిరుచినాపల్లి నుంచి వేదారణ్యం వరకు ఉప్పుసత్యాగ్రహ యాత్ర చేశారు.
     ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ శాసనోల్లంఘనోద్యమాన్ని ‘పెషావర్’ (వాయువ్య సరిహద్దు రాష్ర్టం)లో విజయవంతంగా నడిపారు.
 సైమన్ కమిషన్ సూచించిన అంశాలను పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1930 లో అఖిలపక్ష సమావేశాన్ని లండన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాలుగా నిర్వహించాలని నిర్ణయించింది.
     భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించడం వల్ల    మొదటి రౌండ్ టేబుల్ సమావేశం(1930) విఫలమైంది.
 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి(1931) హాజరయ్యేటట్లు అప్పటి వైస్రాయ్ ఇర్విన్  గాంధీతో ఒప్పందం చేసుకున్నాడు.

గాంధీ-ఇర్విన్ ఒప్పందంలో భాగంగా గాంధీ శాసనోల్లంఘనోద్యమాన్ని నిలిపివేశారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ‘గాంధీ’ అభిప్రాయాలను బ్రిటిషర్లు అంగీకరించలేదు. దాంతో గాంధీ ఇండియాకు తిరిగివచ్చి శాసనోల్లంఘనోద్యమాన్ని పునరుద్ధరించారు.

     3వ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా కాంగ్రెస్ బహిష్కరించింది.
     1932లో సిక్కులకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చేశారు.
     అన్ని రౌండ్‌టేబుల్ సమావేశాలకు బి.ఆర్. అంబేద్కర్ హాజరయ్యారు.
     అస్పృశ్యతా నివారణ సంఘాన్ని  గాంధీజీ  స్థాపించారు.

     అస్పృశ్యులను గాంధీజీ ‘హరిజనులు’ అని (భగవంతుని ప్రజలు) పిలిచారు. హరిజన్ అనే పత్రికను నడిపారు.
     కాంగ్రెస్‌లో భాగంగా జవహర్‌లాల్ నెహ్రూ 1934లో ‘కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ’ని ఏర్పాటు చేశారు.
     అణచివేతకు గురైన జాతుల మహాసభ 1927లో ‘బ్రస్సెల్స్’(బెల్జియం)లో జరిగింది. ఆ సమావేశానికి జవహర్‌లాల్ నెహ్రూ హాజరయ్యారు.
     స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో 562 స్వదేశీ సంస్థానాలుండేవి.
     స్వదేశీ సంస్థానాల్లోని ప్రజలు తమ హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థలన్నీ కలిసి
 1927లో ‘ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్‌‌స’ను నెలకొల్పారు. దానికి బల్వంత్‌రాయ్ మెహతా సెక్రటరీగా ఉండేవారు. 1939లో ఈ సంస్థకు జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
     1935 చట్టం ద్వారా రాష్ట్రాల్లో స్వయం పాలనను అనుమతించారు.
 గాంధీజీ రూపొందించిన నూతన విద్యా విధానాన్ని ‘బేసిక్ విద్య’ అంటారు. ఇందులో ఏదో ఒక వృత్తి విద్య ఉంటుంది.
 1940లో అబుల్ కలామ్ ఆజాద్ అధ్యక్షతన జరిగిన ‘రామ్‌ఘర్’ కాంగ్రెస్ సమావేశంలో ‘వ్యక్తిగత సత్యాగ్రహాలు’ చేయాలని నిర్ణయించారు.
 వ్యక్తి సత్యాగహం అంటే సత్యాగ్రహులు బహిరంగ ప్రదేశంలో బ్రిటిషర్లపై వ్యతిరేక ప్రసంగం చేసి స్వచ్ఛందంగా అరెస్ట్ అవడం. మొదటి వ్యక్తిగత సత్యాగ్రాహి ఆచార్య వినోబాభావే.
 రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్లకు భారతీయులు సహకారం అందించాలని  బ్రిటిష్ మంత్రి ‘సర్ స్టాఫర్‌‌డ క్రిప్స్’ భారతీయులతో రాయబారం జరిపాడు.
 1942 బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ‘క్విట్ ఇండియా ఉద్యమం’ ప్రారంభించాలని నిర్ణయించారు.
     క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీజీ ‘సాధించు లేదా మరణించు’ (ఈౌ ౌట ఈజ్ఛీ) అని నినదించారు.
     క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్యులైన నాయకులందరూ నిర్బంధంలో ఉండగా జయప్రకాశ్‌నారాయణ్, అరుణాఅసఫాలీ, ఎస్.ఎం. జోషి,  రామ్ మనోహర్ లోహియా ఉద్యమానికి నాయకత్వం వహించారు.
 రాస్‌బీహారీబోస్ ‘ఇండియన్ ఇండిపెండెన్‌‌స లీగ్’ను ఏర్పాటు చేశాడు. ఈ లీగ్ భారతీయ సైనికుడైన మోహన్‌సింగ్ ఆధ్వర్యంలో ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ (ఆజాద్ హింద్ ఫౌజ్)ని ఏర్పాటు చేసింది.
 సుభాష్‌చంద్రబోస్ ‘ఇండియన్ నేషనల్ ఆ ర్మీ’లో చేరి పటిష్ట పరిచారు. ఆయన 1943 అక్టోబరు 21న సింగపూర్‌లో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
 స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1946లో భారత్‌కు ముగ్గురు సభ్యులతో కూడిన ‘కేబినెట్ మిషన్’ను పంపింది.
     కేబినెట్ మిషన్‌లో సభ్యులు: పెథిక్ లారెన్‌‌స (భారత వ్యవహారాల మంత్రి), సర్ స్టాఫర్‌‌డ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్.
     ముస్లింలకు ప్రత్యేకంగా పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని మహ్మదాలీ జిన్నా (ముస్లిం లీగ్) పట్టు పట్టాడు.
     వైస్రాయ్ వేవెల్ భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని  నెహ్రూ, జిన్నాలను కోరారు. జిన్నా తిరస్కరించారు.
     రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు నిర్వహించారు.
     పాకిస్థాన్ విభజనకు గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ 1947 మార్చిలో ప్రణాళికను రూపొందించాడు.

మరిన్ని వార్తలు