భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం?

9 Oct, 2014 02:22 IST|Sakshi
భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం?

 ప్రాక్టీస్ బిట్స్- భారత రాజ్యాంగం
 
 1.    భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి మొదటగా ప్రతిపాదించింది?
     ఎ) వేవేల్ ప్రణాళిక    బి) క్రిప్స్ కమిషన్
     సి) కేబినెట్ మిషన్ ప్లాన్
     డి) మౌంట్‌బాటన్ ప్రణాళిక
 
 2.    భారత రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు?
     ఎ) జూలై, 1946     బి) ఆగస్టు, 1946
     సి) డిసెంబర్, 1946     డి) జనవరి, 1947
 
 3.    భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన రోజు?
     ఎ) ఆగస్టు 15, 1946     బి) సెప్టెంబర్ 27, 1946
     సి) నవ ంబర్ 15, 1946
     డి) డిసెంబర్ 9, 1946
 
 4.    ఏ దేశ సాంప్రదాయాన్ని అనుసరించి సీనియర్ సభ్యుడైన సచ్ఛిదానందా సిన్హాను రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు?
     ఎ) బ్రిటన్         బి) ఫ్రెంచి
     సి) గ్రీక్         డి) అమెరికన్
 
 5.     రాజ్యాంగ పరిషత్ రెండో సమావేశం (డిసెంబర్ 11, 1946)లో.. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైంది?
     ఎ) జవహర్‌లాల్ నెహ్రూ
     బి) అంబేద్కర్
     సి) రాజేంద్రప్రసాద్
     డి) జేబీ కృపాలనీ
 
 6.    భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్?
     ఎ) బూబు రాజేంద్రప్రసాద్
     బి) అంబేద్కర్    సి) వల్లభాయ్ పటేల్
     డి) నెహ్రూ
 
 7.    రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమావేశం ఏ రోజున మొదటిసారి జరిగింది?
     ఎ) ఆగస్టు 15, 1947    బి) ఆగస్టు 14, 1947
     సి) ఆగస్టు 24, 1947     డి) ఆగస్టు 29, 1947
 
 8.    రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారెవరు?
     ఎ) కె.ఎం. మున్షీ     బి) సయ్యద్ సాదుల్లా
     సి) వల్లభాయ్ పటేల్     డి) ఎన్. మాధవ రావు
 
 9.    రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుల సంఖ్య (అధ్యక్షుడితో కలిపి)?

     ఎ) 6     బి)7     సి) 8    డి)9
 
 10.    కేబినెట్ మిషన్‌లో సభ్యులు కానివారెవరు?
     ఎ) మౌంట్‌బాటన్     బి) క్రిప్స్
     సి) అలెగ్జాండర్     డి) ఫెథిక్ లారెన్స్
 
 11.    భారత రాజ్యాంగాన్ని ఏ రోజున రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది?
     ఎ) జనవరి 26, 1950     బి) నవంబర్ 26, 1949
      సి) జనవరి 26, 1949     డి) నవంబర్ 26, 1950
 
 12.    రాజ్యాంగాన్ని రాయడానికి పట్టిన కాలం?
     ఎ) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
     బి) 2 సంవత్సరాల 9 నెలల 21 రోజులు
     సి) 2 సంవత్సరాల 10 నెలల 24 రోజులు
     డి) 2 సంవత్సరాల 12 నెలల 9 రోజులు
 
 13.    భారత రాజ్యాంగ రూపకల్పనకు ప్రధాన ఆధారమైన చట్టం?
     ఎ) భారత స్వాతంత్య్ర చట్టం, 1947
     బి) 1909, భారత ప్రభుత్వ చట్టం
     సి) 1919, మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ చట్టం
     డి) 1935, భారత ప్రభుత్వ చట్టం
 
 14.    భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగిన రోజు?
     ఎ) జనవరి 24, 1950    బి) జనవరి 26, 1950
     సి) నవంబర్ 26, 1949
     డి) డిసెంబర్ 31, 1919
 
 15.    భారత్, పాకిస్థాన్‌లను ఏ ప్రణాళిక ప్రకారం  విభజించారు?
     ఎ) కేబినెట్ మిషన్ ప్రణాళిక
     బి) లార్డ్‌లిన్‌లిత్‌గో ప్రణాళిక
     సి) సి.ఆర్.ఫార్ములా
     డి)మౌంట్‌బాటన్ ప్రణాళిక
 
 16.    భారత రాజ్యాంగాన్ని ‘అతుకుల బొంత’గా పేర్కొంది?
     ఎ) కె.సి. వేర్     బి) ఐవర్ జెన్నింగ్స్
     సి) ఎ.వి.డైసీ     డి) ఆస్టిన్
 
 17.    భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం?
     ఎ) పావురం     బి)సింహం
     సి) పులి         డి) ఏనుగు
 
 18.    భారత రాజ్యాంగం ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది?
     ఎ) ఆగస్టు 15, 1947     బి) నవంబర్ 26, 1950
      సి) జనవరి 1, 1950     డి) జనవరి 26, 1950
 
 19.    భారతదేశానికి తాత్కాలిక గవర్నర్ జనరల్‌గా పని చేసిన భారతీయుడు?
     ఎ) నెహ్రూ         బి) రాజేంద్రప్రసాద్
     సి) రాజగోపాలచారి     డి) జె.బి. కృపాలనీ
 
 20.    స్వతంత్ర భారత మొట్ట మొదటి హోం మంత్రి?
     ఎ) అబ్దుల్ కలామ్ ఆజాద్
     బి) జగ్జీవన్ రామ్    సి) వల్లభాయ్ పటేల్
     డి) నెహ్రూ
 
 21.    భారత రాజ్యాంగ ముఖ్య ఆధారాల ప్రకారం సరికాని జత?
     ఎ) ఐర్లాండ్ రాజ్యాంగం-ఆదేశిక సూత్రాలు
     బి) రష్యా రాజ్యాంగం-ప్రాథమిక విధులు
     సి) జపాన్ రాజ్యాంగం-జీవించే హక్కు
     డి)    {బిటన్ రాజ్యాంగం-పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం
 
 22.    భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి?
     ఎ) 8     బి) 10     సి)12     డి) 14
 
 23.    మన రాజ్యాంగ రూపకల్పన కోసం.. రాజ్యాంగ పరిషత్ సుమారు ఎన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించింది?
     ఎ) 16     బి) 25     సి) 58     డి) 60

 24.    మన రాజ్యాంగం ప్రవేశికలో ప్రస్తావించిన తేదీ?
     ఎ) ఆగస్టు 15, 1947    బి) జనవరి 26, 1950
     సి) నవంబర్ 26, 1949    డి) డిసెంబర్ 15, 1948
 
 25.    మన రాజ్యాంగాన్ని రచించడానికి సుమారు ఎన్ని రూపాయాలు ఖర్చయ్యాయి?
     ఎ) 10 లక్షలు     బి) 64 లక్షలు
     సి) 78 లక్షలు     డి) 86 లక్షలు
 
 26.    మన జాతీయ జెండా ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది?
     ఎ) ఆగస్టు 15, 1947
     బి) జనవరి 26, 1950
     సి) జూలై 22, 1947
     డి) జనవరి 24, 1950
 
 27.    స్వతంత్ర భారత ప్రథమ ఉపరాష్ట్రపతి?
     ఎ) సర్వేపల్లి రాధాకృష్ణన్
      బి) వల్లభాయ్ పటేల్    సి) జగ్జీవన్‌రామ్
     డి) అనంతశయం అయ్యంగార్
 
 28.    అంబేద్కర్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికయ్యారు?
     ఎ) బాంబే         బి) బెంగాల్
     సి) మద్రాస్     డి) వాయవ్య భారతదేశం
 
 29.    భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ‘రాజ్యాంగ లక్ష్యాల తీర్మానా’న్ని ప్రవేశపెట్టింది?
     ఎ) వల్లభాయ్ పటేల్     బి) నెహ్రూ
     సి) గాంధీజీ     డి) అంబేద్కర్
 
 30.    స్వతంత్ర భారత మొదటి లోక్‌సభ స్పీకర్?
     ఎ) మౌలంకర్     బి) సంజీవరెడ్డి
     సి) సర్దార్ బల్‌దేవ్ సింగ్    డి) ఎస్.పి. ముఖర్జీ
 
 31.    తాత్కాలిక ప్రభుత్వంలో అంబేద్కర్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ శాఖ?
     ఎ) న్యాయ         బి) కార్మిక
     సి) విద్యా         డి)ఏదీకాదు
 
 32.    భారత జాతీయ కాంగ్రెస్ ఏ రోజును ప్రతి సంవత్సరం పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా నిర్వహించేది?
     ఎ) ఆగస్టు 15     బి) జనవరి 26
     సి) అక్టోబర్ 2     డి) నవంబర్ 14
 
 33.    రాజ్యాంగ సవరణ విధానాలను ఏ రాజ్యాంగ నిబంధనల ఆధారంగా తీసుకున్నారు?
     ఎ) ఆస్ట్రేలియా
     బి) బ్రిటన్
     సి) దక్షిణాఫ్రికా
     డి) కెనడా
 
 34.    రాజ్యాంగంలోని ప్రకరణలు (ఆర్టికల్స్)?

     ఎ) 395     బి) 398     సి) 408     డి) 424
 
 35.    కింది వాటిలో ఏక కేంద్ర లక్షణం కానిది?
     ఎ) అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఉండటం
     బి) ఏక పౌరసత్వం     సి) అధృడ రాజ్యాంగం
     డి) స్వతంత్ర న్యాయ వ్యవస్థ
 
 36.    కింది వాటిలో సమాఖ్య లక్షణం?
     ఎ) రాష్ట్రపతి అత్యవసర అధికారాలు
     బి) ఉన్నత న్యాయస్థానం
     సి) లిఖిత రాజ్యాంగం     డి) ప్రాథమిక హక్కులు
 
 37.    భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
     ఎ) 24వ     బి) 42వ     సి) 44వ     డి)48వ
 
 38.    42వ (1976)రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదంతోపాటు చేర్చిన మరో పదం?
     ఎ) ప్రజాస్వామ్యం     బి) గణతంత్ర
     సి) సమగ్రత     డి) సారభౌమత్వం
 
 39.    భారత రాజ్యాంగం ఏ మతాన్ని/మతాలను గుర్తించింది?

     ఎ) హిందూ-ముస్లిం-క్రిస్ట్టియన్
     బి) హిందూ-ముస్లిం-క్రిస్టియన్-సిక్కు
     సి) అన్ని మతాలు    డి) ఏదీకాదు
 
 40.    భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది?
     ఎ) 18     బి) 20     సి) 22     డి) 24
 
 41.    ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు?
     ఎ) 42వ (1976)     బి) 44వ (1978)
     సి) 46వ (1976)     డి) 48వ (1978)
 
 42.    భారత రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కు?
     ఎ) ప్రాథమిక హక్కు     బి) మానవ హక్కు
     సి) చట్టబద్దమైన హక్కు
     డి) ఆర్థిక హక్కు
 
 43.    భారత రాజ్యాంగ సామ్యవాద స్ఫూర్తికి ఆధారాలు?
     ఎ) ఆదేశిక సూత్రాలు     బి) ప్రాథమిక హక్కులు
     సి) ప్రాథమిక విధులు     డి) స్థానిక సంస్థలు
 
 44.    మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ విధంగా రాసి ఉంటుంది?
     ఎ)    సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద రాజ్యం
     బి)    సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
     సి)    సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, లౌకిక రాజ్యం
     డి)    సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య రాజ్యం
 
 45.    గణతంత్ర రాజ్యమంటే?
     ఎ) రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు
     బి) రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు
     సి)    రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు
     డి) పైవన్నీ
 
 46.    రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మన రాజ్యాంగాన్ని రాసిందెవరు?
     ఎ) రాజ్యాంగ పరిషత్
     బి) రాజ్యాంగ ముసాయిదా కమిటీ
     సి) ప్రజలు
     డి) ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు
 
 47.    భారత రాజ్యాంగంలోని నాలుగో భాగం దేనికి సంబంధించింది?
     ఎ) ఆదేశిక సూత్రాలు    బి) ప్రాథమిక హక్కులు
     సి) పౌరసత్వం     డి) ప్రాథమిక విధులు
 
 48.    డెమోక్రసీ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి గ్రహించారు?
     ఎ) గ్రీక్         బి) ఫ్రెంచి
     సి) జర్మన్         డి) స్పానిష్
 
 49.    ‘భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ప్రజలదే’... భారత జీవన స్రవంతిలో ఏ అంశం ఈ లక్షణాన్ని వర్ణిస్తుంది?
     ఎ) ప్రజాస్వామ్యం     బి) లౌకికతత్వం
     సి) సామాజిక న్యాయం     డి) పైవన్నీ
 
 50.    మనం ఫెడరేషన్ భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం?
     ఎ) ఐర్లాండ్         బి) ఆస్ట్రేలియా
     సి) జర్మనీ        డి) కెనడా
 
 51.    1946లో ఏర్పాటు చేసిన మధ్యంతర కేబినెట్ అధ్యక్షుడెవరు?
     ఎ) రాజేంద్రప్రసాద్
     బి) నెహ్రూ
     సి) వల్లభాయ్ పటేల్
     డి) రాజగోపాలాచారి
 
 52.    గాంధీ దృష్టిలో సంక్షేమ రాజ్యానికి కావాల్సినవి?
     ఎ) ఆదేశిక సూత్రాలు     బి) ప్రాథమిక హక్కులు
     సి) ప్రాథమిక విధులు    డి) అత్యవసర అధికారాలు
 
 
 సమాధానాలు:
     1) బి;    2) ఎ;    3) డి;    4) బి;    5) సి;
     6) బి;    7) డి;    8) సి;    9) బి;    10) ఎ;
     11) బి;    12) ఎ;    13) డి;    14) ఎ;    15) డి;
     16) బి;    17) డి;    18) డి;    19) సి;    20) సి;
     21) డి;    22) సి;    23) డి;    24) సి;    25) బి;
     26) సి;    27) ఎ;    28) బి;    29) బి;    30) ఎ;
     31) డి;    32) బి;    33) సి;    34) ఎ;    35) డి;
     36) సి;    37) బి;    38) సి;    39) డి;    40) సి;
     41) బి;    42) సి;    43) ఎ;    44) బి;    45) డి;
     46) సి;    47) ఎ;    48) ఎ;    49) ఎ;    50) డి;
     51) బి;    52) ఎ.
 

మరిన్ని వార్తలు