థర్డ్ వాయిస్

9 Oct, 2014 02:23 IST|Sakshi
థర్డ్ వాయిస్

లోకంలో అంతా ఆడా, మగా మాత్రమే ఉండాలా? అటూ ఇటూ కాని మూడో ప్రకృతి వునుషులకు చోటే లేదా? ఆడా, మగా కాని హిజ్రా.. ట్రాన్స్‌జెండర్.. ఎవరైనా కానీ, వాళ్లకూ బతికే హక్కు ఉంది.  ఆత్మగౌరవమూ ఉంది. తవు హక్కుల కోసం తెలంగాణ హిజ్రా, ట్రాన్స్‌జెండర్ సమితి ఈ నెల 10న స్వాభిమాన్ సభ ఏర్పాటు చేయనుంది. స్వాభిమాన్ సభ కార్యాచరణను ఖరారు చేసేందుకు బుధవారం వీళ్లంతా భేటీ అయ్యారు. సమావేశమయ్యాక కాసేపు కష్టసుఖాలను కలబోసుకున్నారు.
 
 ‘ఈ మున్నీ.. దాని పన్నెండేళ్ల వయుసులో నా దగ్గరకొచ్చింది. అప్పటి నుంచి దానికి అమ్మా నాన్నా, అత్త అన్నీ నేనే’ అంది మీనా. ‘మీది ఈ ఊరేనా?’ అడిగింది పక్కనే ఉన్న రుక్మిణి. ‘ఈ ఊరే’ చెప్పింది మున్నీ. ‘మీ అవ్మూ నాన్నలకు తెలిసే వచ్చావా?’ అనే మాటను రుక్మిణి పూర్తిచేసే లోపే ‘వాళ్లకు తెలిస్తే వెళ్లనిస్తారే?’ అక్కడున్న మీనా, రోషిణి, రచన ముక్తకంఠంతో అరిచినట్లే అన్నారు. ‘గన్నవరం నుంచి నేనూ అదే వయుసులో ఇక్కడికొచ్చాను. గుర్తుందా మమ్మీ’ అంటూ మీనాకు గుర్తుచేసింది రుక్మిణి. ‘ఊ’ అంది మీనా కాస్త బాధగా. ‘నాకు పన్నెండేళ్లొచ్చేదాకా తెలియుదు.. నేను అబ్బాయి రూపంలో ఉన్న అమ్మాయినని.. నా వూట, నడక చూసి స్కూల్లో ఎంత ఎగతాళి చేసేవారో.. ఎక్కడికెళ్లినా కొజ్జా అనే తప్ప నా సొంత పేరుతో పిలిచేవారే కాదు.

అవన్నీ భరించలేకే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పారిపోయి హైదరాబాద్ వచ్చేశా’ బాధ పంచుకుని, వునసు తేలిక చేసుకుంది రుక్మిణి. ‘నాదీ అదే పరిస్థితి..’ ఊరడింపుగా రుక్మిణి భుజం తట్టింది రోషిణి. ‘మనలాంటోళ్లకు ముంబైలో రెస్పెక్ట్ ఉంటది’ అని ఒక ఫ్రెండ్ చెప్పిన మాట విని, ఆ ఫ్రెండ్‌తో ముంబై వెళ్లి సర్జరీ చేయించుకున్నా. ఆరేళ్ల తర్వాత ఇంటిమీద బెంగ మొదలైంది. అవ్ముకు ఫోన్ చేశా.. అమ్మ రమ్మంది. వెళ్లిన. అన్నయ్యు వాళ్లు గొడవపెట్టారు. హైదరాబాద్ వచ్చిన’ తన గాథ చెప్పుకుంది రోషిణి. ‘వాళ్లు నిన్ను కాదనుకున్నా, నువ్వు వాళ్లను కాదనుకోలేదు కదా.. చెల్లి పెళ్లి చేసినవ్. అవ్మూ నాన్నను చూసుకుంటున్నవ్.. ఏ బాధ్యత వురిచినవని?’ ఊరడించింది మీనా. ‘రచన ఏం వూట్లడ్త లేదు’ మీనా పలకరింపు. ‘ఏం వూట్లాడాలే.. ఎవరి కథ అయినా అంతే.
 
 మీరంతా ఏం చేస్తున్నారో, డబుల్ పీజీ చేసి నేనూ అదే చేస్తున్నా.. అమ్మ లేదు. ఉన్న నాన్న బాధ్యత నాదే. అక్క, చెల్లి పెళ్లిళ్లపోయి అత్తగారిళ్లలో ఉన్నారు. ఇద్దరూ నాన్న ఆస్తిని సమానంగా పంచుకున్నారు. బాధ్యతను మాత్రం నాకు వదిలారు. నన్ను అర్థం చేసుకున్నది ఒక్క నాన్నే. ఆయున బయటకు వెళ్లినప్పుడల్లా ‘నీ కొడుకేంటీ.. పోనీటెరయిల్ కట్టుకుంటాడు.. కుర్తా పైజామా వేసుకుంటాడు.. ఆడాళ్లలా వూట్లాడతాడు’ అని ఇబ్బంది పెడతారు జనం. ఆ బాధ, కోపం ఇంటికొచ్చి నా మీద తీర్చుకుంటాడాయున. ఊహ తెలిసినప్పటి నుంచి అలవాటైపోరుుంది కాబట్టి ఆయున వునసు నేను అర్థం చేసుకుంటాను’ అంటూ తన బాధను పంచుకుంది రచన. ‘ఇంట్లో వాళ్లంటే జన్మనిచ్చారు కాబట్టి వాళ్లకు బాధ ఉండొచ్చు.. బయట వాళ్లకేం బుద్ధి ఇంతలా ఇన్సల్ట్ చేస్తారు?’ మున్నీ ఆవేదన. ‘మనమేం అడుగుతున్నం.. వున వూనాన వునల్ని బతకనిస్తే చాలనే కదా.. మనుషుల్లెక్క గుర్తిస్తే చాలనే కదా..’ మీనా ఆక్రోశం.
 
 సమానమైన గుర్తింపు
 వుహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో హిజ్రా, ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు ఉంది. మిగిలిన పౌరులతో సవూనంగా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వాళ్ల కోసం ఒక సంక్షేవు వుండలి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనూ అలాంటి సౌకర్యాలు కావాలని మేం డిమాండ్ చేస్తున్నాం. స్కూళ్లు,  కాలేజీల్లోనే కాదు, ఓటరు ఐడీలోనూ ఐచ్ఛికమైన పేరు నమోదు చేసుకునే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం. పదో తేదీన ఇలాంటి డిమాండ్లతోనే కేటీఆర్‌కు మెమొరాండం ఇవ్వనున్నాం. అలాగే స్కూళ్లలోనూ. ఇవన్నీ కల్పిస్తేనే మిగిలిన పౌరసమాజంతో సవూనంగా వీళ్లకు గుర్తింపు వస్తుంది.
 - కార్తీక్, పోస్ట్ డాక్టొరల్ స్కాలర్, హిజ్రా, ట్రాన్స్‌జెండర్ సమితి మెంబర్
 -  సరస్వతి రమ

మరిన్ని వార్తలు