ఫేస్‌బుక్ టార్గెట్ ఏంటి..?

1 Dec, 2016 00:34 IST|Sakshi
ఫేస్‌బుక్ టార్గెట్ ఏంటి..?
 గతంలో ఫ్రీ బేసిక్స్ పేరిట సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ అందిస్తామంటూ విమర్శలపాలైన ఫేస్‌బుక్.. మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి ‘ఎక్స్‌ప్రెస్ వైఫై’ అంటూ దూసుకొస్తోంది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ వైఫైతో మొబైల్‌కి, సిస్టంకి అత్యంత తక్కువ ధరల్లో కనెక్ట్ కావచ్చంటూ ప్రచారం చేస్తోంది. దాదాపు 125 లొకేషన్లలో ఈ ఎక్స్‌ప్రెస్ వైఫై ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు అందుబాటులోకి రానప్పటికీ డిజిటల్ వోచర్స్ ద్వారా వినియోగదారులు డేటా ప్యాక్‌లు కొనాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా స్థానిక ఇంటర్నెట్ ప్రొవైడర్లను మరింత బలోపేతం చేయడంతోపాటు స్థిరమైన రాబడికి తోడ్పడుతుందన్నది ఫేస్‌బుక్ వాదన. అయితే ధరల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.
 
మరిన్ని వార్తలు