ఎంబీబీఎస్.. ఏ ర్యాంకుతో ఎక్కడ సీటు?

3 Jun, 2015 23:29 IST|Sakshi

 ఎంబీబీఎస్.. బీడీఎస్.. లక్షల మంది విద్యార్థుల కల..! కానీ, సీట్లు మాత్రం పది వేల లోపే! అందుకే విద్యార్థుల్లో ఆందోళన. ఏ ర్యాంకు వరకు సీటు వస్తుందా అని! ముఖ్యంగా గతేడాది వరకు ప్రైవేటు-బీ కేటగిరీలో కౌన్సెలింగ్ ద్వారా అందుబాటులో ఉండే పది శాతం సీట్లను ఈ ఏడాది నుంచి ఆయా ప్రైవేటు కళాశాలల  మేనేజ్‌మెంట్‌లే భర్తీ చేసుకోవచ్చనే ప్రభుత్వాల ఉత్తర్వులతో మరికొన్ని సీట్లలో కోత పడనుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు, కౌన్సెలింగ్ ద్వారా భర్తీ అయ్యే సీట్లు, మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ అయ్యే సీట్లు.. గత ఏడాది కటాఫ్‌ల అంచనాలతో విశ్లేషణ..
 
 ఎంబీబీఎస్, డెంటల్ కళాశాలలు, అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు..
 తెలంగాణ రాష్ట్రంు కళాశాలల్లో 2,000 సీట్లు అంటే మొత్తం 2,850 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెండు మైనారిటీ కళాశాల సీట్లు (300) కౌన్సెలింగ్ పరిధిలోకి రావు.బీడీఎస్ కోర్సులో పది ప్రైవేటు కళాశాలల్లో వెయ్యి సీట్లు, ఒక ప్రభుత్వ కళాశాలలో (గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ - హైదరాబాద్)లో 100 సీట్లు మొత్తం 1100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 
 ఆంధ్రప్రదేశ్‌లో
 ఎంబీబీఎస్ కోర్సులో ఆంధ్రప్రదేశ్‌లో 12 ప్రభుత్వ కళాశాలల్లో (స్టేట్ వైడ్ ఇన్‌స్టిట్యూట్‌గా పేర్కొనే సిద్ధార్ధ మెడికల్ కాలేజ్ విజయవాడ సహా) 1900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లోని 150 సీట్లు కేవలం మహిళలకే. 12 ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 1900 సీట్లు అందుబాటులో ఉన్నాయి.బీడీఎస్ కోర్సులో రెండు ప్రభుత్వ కళాశాల్లో 140 సీట్లు; ప్రైవేటు డెంటల్ కళాశాలల్లో 1060 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 
 భర్తీ ఇలా:
 ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లను, ప్రైవేటు కళాశాలల్లోని మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను కౌన్సెలింగ్ ద్వారా మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోని మిగతా 50 శాతం సీట్లను రెండు రాష్ట్రాల్లోనూ ఆయా కళాశాలల మేనేజ్‌మెంట్‌లు ఒక కన్సార్షియంగా ఏర్పడి ప్రత్యేక ఎంట్రెన్స్, అందులో మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.
 
 తగ్గిన ప్రైవేటు ‘కౌన్సెలింగ్’ సీట్లు..
  పెరిగిన మేనేజ్‌మెంట్ కోటా: గత ఏడాది వరకు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోని మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను ప్రైవేట్-ఎ పేరిట, మరో పది శాతం సీట్లను ప్రైవేట్-బి పేరిట కౌన్సెలింగ్ ద్వారా మెరిట్ ఆధారంగా భర్తీ చేశారు. అంటే మొత్తం 60 శాతం సీట్లు కౌన్సెలింగ్ ద్వారా లభించేవి. కానీ ఈ ఏడాది నుంచి ప్రైవేట్-బి పరిధిలోని 10 శాతం సీట్లను కూడా మేనేజ్‌మెంట్‌లు సొంతగా భర్తీ చేసుకునే అవకాశం ప్రభుత్వాలు కల్పించాయి. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్-బి పరిధిలోకి వచ్చే 200 సీట్లు; ఆంధ్రప్రదేశ్‌లో 190 సీట్లు తగ్గనున్నాయి. ఈ సీట్లు పొందాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కళాశాలల సంఘాలు వేర్వేరుగా నిర్వహించిన ప్రైవేట్ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి.
 
 35 శాతానికి చేరిన మేనేజ్‌మెంట్ సీట్లు:
 ఈ ఏడాది రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో మెడికల్ కౌన్సెలింగ్‌లో కేవలం యాభై శాతం సీట్లు మాత్రమే అభ్యర్థులకు కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉండనున్నా యి. మిగతా సీట్లను రెండు కేటగిరీలుగా మేనేజ్‌మెంట్‌లు భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడింది. గత ఏడాది వరకు ప్రైవేట్-బి పేరుతో కౌన్సెలింగ్‌లో ఉండే 10 శాతం సీట్లతోపాటు ప్రైవేట్ సి కేటగిరీలో సి1 పేరుతో ఉండే 25 శాతం సీట్లు మొత్తం కలిపి 35 శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌లే భర్తీ చేసుకోనున్నాయి. ప్రైవేట్-సి కేటగిరీలోనే సి-2 పేరుతో ఎన్‌ఆర్‌ఐల కోసం ఉద్దేశించిన 15 శాతం సీట్లపై అధికారం యాజమాన్యాలదే. అంటే.. స్థూలంగా విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రైవేటు సీట్లు యాభై శాతం మాత్రమే.
 
 ఫీజుల వివరాలుతెలంగాణ రాష్ట్రంలో:
 ఎంబీబీఎస్:ప్రభుత్వ కళాశాలల ఫీజు: రూ. 10 వేలు
 ప్రైవేట్- బి కేటగిరీ ఫీజు: రూ. 9 లక్షలు
 ప్రైవేట్ సి2 (ఎన్‌ఆర్‌ఐ) ఫీజు: రూ. 15 లక్షలు
 బీడీఎస్:ప్రభుత్వ కళాశాలల ఫీజు: రూ. 9 వేలు
 ప్రైవేట్ - ఎ కేటగిరీ ఫీజు: రూ. 45 వేలు
 ప్రైవేట్ -బి కేటగిరీ ఫీజు: రూ. 2.7లక్షలు
 ప్రైవేట్- సి2 (ఎన్‌ఆర్‌ఐ)ఫీజు: రూ. 2.7 లక్షలు
 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత పెరిగిన బి కేటగిరీ ఫీజులుమేనేజ్‌మెంట్ కోటా ఫీజులు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత పెరిగాయి.ఎంబీబీఎస్‌లో ప్రైవేట్ - బి కేటగిరీ ఫీజు సంవత్సరానికి రూ. 11లక్షలుగా నిర్ణయించారు. ప్రైవేట్ సి(ఎన్‌ఆర్‌ఐ) కోటా దాదాపు 55 లక్షలు కానుం ది. (బి-కేటగిరీ ఫీజుకు అయిదు రెట్ల కంటే ఎక్కువ ఉండరాదు అని జీఓలో పేర్కొన్నారు. ఆ లెక్క మేరకు ఎన్‌ఆర్‌ఐ కోటా సీటు ఫీజు రూ. 55 లక్షలు కానుంది)బీడీఎస్‌లో బి-కేటగిరీ ఫీజు సంవత్సరానికి 4.5 లక్షలుగా నిర్ణయించారు.బీడీఎస్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజు రూ.22 లక్షలు కానుంది. (ఈ కోర్సు విషయంలోనూ బి-కేటగిరీ ఫీజుకు అయిదు రెట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అని జీఓలో పేర్కొన్నారు.)
 
 ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారానే కౌన్సెలింగ్!
 తెలుగు రాష్ట్రాలు రెండుగా అయినప్పటికీ ఈ ఏడాదికి ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారానే కౌన్సెలింగ్ చేపట్టాలని నిర్ణయించారు. అయితే సీట్ల భర్తీ పరంగా లోకల్, నాన్ లోకల్ విధానాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టమైన విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఈ లోపు అభ్యర్థులు గత ఏడాది ఆయా రీజియన్ల వారీగా చివరి ర్యాంకుల వివరాలు తెలుసుకుని.. ప్రస్తుతం తమ ర్యాంకుకు సీటు వచ్చే అవకాశం ఉన్న కళాశాలలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రాంతాల వారీగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం- ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల వివరాలు..

 ఎంబీబీఎస్
 తెలంగాణ (ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్
  కళాశాలలు: 14; సీట్లు: 2000
 ఆంధ్రప్రదేశ్ (ఏయూ రీజియన్)
 ప్రభుత్వ కళాశాలలు: 6; సీట్లు: 950
 ప్రైవేటు కళాశాలలు: 8; సీట్లు: 1250
 ఆంధ్రప్రదేశ్ (ఎస్‌వీయూ రీజియన్)
 ప్రభుత్వ కళాశాలలు: 6; సీట్లు: 950
 ప్రైవేటు కళాశాలలు: 4; సీట్లు: 650
 
 బీడీఎస్
 తెలంగాణ (ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్)
 ప్రభుత్వ కళాశాలలు: 1: సీట్లు: 100
 ప్రైవేటు కళాశాలలు: 10: సీట్లు: 1000
 ఆంధ్రప్రదేశ్ (ఏయూ రీజియన్)
 ప్రభుత్వ కళాశాలలు: 1; సీట్లు: 40
 ప్రైవేటు కళాశాలలు: 9; సీట్లు: 850
 ఆంధ్రప్రదేశ్ (ఎస్‌వీయూ రీజియన్)
 ప్రభుత్వ కళాశాలలు: 1; సీట్లు: 100
 ప్రైవేటు కళాశాలలు: 3; సీట్లు: 250
 
 

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా