కేసీఆర్‌కు బార్ అసోసియేషన్ శుభాకాంక్షలు

18 May, 2014 03:54 IST|Sakshi
కేసీఆర్‌కు బార్ అసోసియేషన్ శుభాకాంక్షలు

 వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును శనివారం బార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అలాగే న్యాయవాదుల సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన ఉంటుందని కేసీఆర్ తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన న్యాయవాదులకు హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుడిమల్ల రవికుమార్, సూరం నర్సింహస్వామి, కార్యవర్గ సభ్యులు గురి, రంజిత్‌కుమార్, ఎన్.వసంతియాదవ్, సురేష్, న్యాయవాదులు ఉన్నారు.

మరిన్ని వార్తలు