పురందేశ్వరి పేరు ప్రస్తావించని బాబు

1 May, 2014 14:21 IST|Sakshi
పురందేశ్వరి పేరు ప్రస్తావించని బాబు

చిత్తూరు : కేంద్ర మాజీ మంత్రి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి పేరును ప్రస్తావించకుండా  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డారు. బీజేపీ-టీడీపీ పొత్తు నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో గురువారం చంద్రబాబు పాల్గొన్నారు. మదనపల్లిలో నరేంద్ర మోడీ సభలో పాల్గొన్న చంద్రబాబు మాత్రం పురందేశ్వరికి మద్దతు తెలపలేదు. అంతేకాకుండా ఆమె పేరును ప్రస్తావించేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు.

కాగా టీడీపీ నుంచి వెళ్లిపోయేంతవరకు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును తిప్పలు పెట్టిన చంద్రబాబుకు పురందేశ్వరి బీజేపీ తరఫున పోటీ చేయడం కూడా ఇష్టం లేదు. బీజేపీ తరఫున కోస్తాలో ఎక్కడ టికెట్టు దక్కించుకున్నా విజయావకాశాలు ఉంటాయనే ఉద్ధేశంతో బాబు చక్రం తిప్పారు. చివరకు రాజంపేట మినహా మరో గత్యంతరం లేని వాతావరణం కల్పించారు. పురందేశ్వరి అయిష్టంగానే రాజంపేట నుంచి నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచారు.

మరోవైపు  దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారంలో నానా అవస్థలు పడుతున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి ఎక్కడా నామమాత్రపు బలం కూడా లేదు. ఇక టీడీపీ శ్రేణుల నుంచి సహకారం అం తంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో ఆమె ఎన్నికల ప్రచారం ముందుకు సాగడం లేదు. బీజేపీ అభ్యర్థి అని చెప్పుకుంటే ఓట్లు రావని అర్థం చేసుకున్న ఆమె ఎన్టీఆర్ తనయగా ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది.
 

మరిన్ని వార్తలు