ఇంకా స్పష్టత లేని హైదరాబాద్ పోలింగ్ శాతం

3 May, 2014 14:34 IST|Sakshi

హైదరాబాద్ : ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పనితీరుపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఏప్రిల్ 30న జరిగిన  తొలివిడత ఎన్నికల పోలింగ్ తుది నివేదికల జాప్యంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ 70మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మెమోలు జారీ చేసింది.  నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి పోలింగ్ శాతం నివేదికలు ఆలస్యంగా అందాయి.

మరోవైపు  హైదరాబాద్లో జరిగిన పోలింగ్ శాతంపై  అధికారులు ఇప్పటికీ స్ఫష్టత ఇవ్వలేదు. అలాగే తక్షణమే పోలింగ్ శాతంపై నివేదికలు పంపాల్సిందిగా అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాలు ఆదేశించారు.

కాగా తెలంగాణాలో  జరిగిన ఎన్నికల పోలింగ్ శాతం పెంచడానికి అధికారులు నగరం మొత్తం సెలవు ప్రకటించినా ఉపయోగం లేకుండా పోయింది. హైదరాబాద్లో కేవలం 53 శాతమే పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపినా... ఇంకా తక్కువగా పోలింగ్ నమోదు అయినట్లు సమాచారం.

 

>
మరిన్ని వార్తలు