తుది ఓటర్ల జాబితా సిద్ధం

25 Mar, 2014 02:35 IST|Sakshi

 రాజంపేట, న్యూస్‌లైన్: ఎమ్మెల్యే, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితా సిద్ధంగా ఉన్నట్లు  ఆర్డీఓ ఎం.విజయసునీత అన్నారు. సోమవారం తన చాంబర్‌లో నియోజకవర్గ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీ నాయకులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అందరి సహకారంతో ఓటర్ల తుది జాబితా పూర్తి చేశామన్నారు. పోలింగ్ రోజున ఏజెంట్‌గా నియమితులయ్యే వ్యక్తికి   ఖచ్చితంగా ఎపిక్‌కార్డు ఉండాలన్నారు. ఆ గ్రామంలో ఓటరుగా ఉండాలన్నారు. అభ్యర్థులు ప్రచారం  కోసం డీఎస్పీ   అనుమతి కోరాలన్నారు. వాహనాలకు సంబంధించి ఆర్‌ఓ అనుమతి ఉండాలన్నారు.

 నిబంధనల మేరకే వాహనాలలో వెళ్లే వారి సంఖ్య ఉండాలన్నారు. నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థులు క్షుణ్ణంగా చదివి నెమ్మదిగా భర్తీ చేయాలన్నారు. మండల పరిధిలోని ఎంపీయూపీ స్కూల్ పేరును మండల ప్రజా పరిషత్ స్కూల్‌గా జాబితాలో సవరణ  చేశామన్నారు. సమావేశంలో  వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు భాస్కర్‌రాజు, రమేష్‌రెడ్డి, గోపిరెడ్డి, దినేష్, నాగేశ్వరనాయుడు, బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లునాయుడు, తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, డీటీ సుబ్బన్న, ఎలక్షన్ డెస్క్ ప్రతినిధి శ్రీధర్ పాల్గొన్నారు.

 ఒంటిమిట్ట కోదండరాముని ఉత్సవాలపై 25న సమావేశం
 ఒంటిమిట్ట కోదండరామాలయం ఉత్సవాలపై ఈనెల 25వ తేదీన సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్డీఓ విజయసునీత తెలిపారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు.

మరిన్ని వార్తలు