కార్పొరేట్ +కాషాయ కషాయం

9 Apr, 2014 02:25 IST|Sakshi
కార్పొరేట్ +కాషాయ కషాయం

* బీజేపీ మేనిఫెస్టో సారాంశమిదే
* మోడీ మాటే వేదంగా రూపకల్పన!
* పలు అంశాలకు కాంగ్రెస్ వాసనలే
* సామాన్యుని కన్నా సంపన్నుడే ముద్దు!
* గుత్తాధిపతుల అడుగులకు మడుగులు

 
దేశంలో ఒక మూల పోలింగు మొదలైన తర్వాత ఎన్నికల ప్రణాళిక విడుదల చేయుడం ద్వారా బీజేపీ విచిత్ర చరిత్ర సృష్టించింది. ప్రధాని అభ్యర్థిగా పగ్గాలు చేపట్టేసినట్టే హడావుడి చేస్తున్న నరేంద్ర మోడీ మోతకూ ప్రణాళికను ఇంత ఆలస్యం చేయుడానికి బొత్తిగా పొంతన లేకపోవడం వాస్తవాల ప్రతిబింబం అనుకోవాలి. ఇప్పటి వరకూ పాలించిన వారికి దార్శనికత లేదని పదేపదే వివుర్శించిన మోడీ తవు పార్టీ ప్రణాళిక విడుదలకే ఇంత సమయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాని విషయుం. అసలు మోడీ అంతటి వునిషి ఉండగా ఎన్నికల ప్రణాళికలు, ఇతరేతరాలు బొత్తిగా అవసరం లేదని, ఆయున వుుఖారవిందమే సరిపోతుందని కార్పొరేట్ మీడియూ ఘనాపాఠీలు కొందరు ప్రవచించారు కూడా. ప్రణాళిక విడుదల చేయుడవుంటే ప్రజలకు వాగ్దానాలు చేసి ఉచ్చులో చిక్కుకుపోవడమేనన్నది వారి బాధ.
 
 వాస్తవానికి ఈ విషయుంలో బీజేపీకి ఎవరి పాఠాలూ అవసరమే లేదు. జనసంఘం అవతారాన్ని వదిలిపెట్టి బీజేపీగా ఏర్పడిన 1980 నుంచి నేటి వరకూ ఒకో ప్రణాళికలో ఒక విధమైన నినాదమివ్వడం, విధానాలను తలకిందులుగా వూర్చుకోవడం పరిపాటిగా వూరింది. అరుుతే 1984లో రెండు స్థానాలకు పడిపోరుున చేదు అనుభవం కారణంగా తదుపరి ఎన్నికల నుంచి నేటి వరకూ సంఘ పరివార్ వుూల సూత్రాల వంటి వుూడు వుుక్కలను వూత్రం వదిలిపెట్టకుండా పట్టుకొస్తున్నది. మిగిలిన వూటలన్నీ వ్యర్థవున్నది బీజేపీ అవగాహన. కనుకనే 1999లో తమ ఎన్డీఏ ప్రభుత్వ పాలనా పత్రం తప్ప బీజేపీ ఎన్నికల ప్రణాళిక అంటూ విడుదల చేయులేదు. 2004లోనూ విజన్ పేరిట పత్రం తప్ప ప్రణాళిక వెలువరించలేదు.
 
 2009లో వూత్రం సూటిగానే ప్రణాళిక విడుదల చేసినప్పుడు ఈ వుూడు వుుక్కలకూ చోట కల్పించింది. ఈసారి పాతబడిన వుతతత్వ అంశాలను పక్కకు పెట్టేసి అభివృద్ధిపై కేంద్రీకరించాలని మోడీ పట్టుబట్టినందువల్లే ప్రణాళిక విడుదల ఆలస్యమైందని కూడా ప్రచారం సాగింది. తీరా ఏప్రిల్ ఏడున విడుదలైన సదరు ప్రణాళిక చూస్తే హిందూత్వకు మోడీత్వ తొడుగు వేసిన చందంగా - కార్పొరేట్ కాషాయు కషాయుంగా గోచరిస్తోంది. కాంగ్రెస్‌కు తామే ప్రత్యావ్నూయువుని చెప్పే బీజేపీ చాలా అంశాల్లో అవే రాగాలు ఆలపించడమే గాక అదనంగా తనదైన వుతతత్వ అజెండాను కూడా జోడించడం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇది తవు నుంచి తీసుకున్న కట్ అంట్ పేస్ట్ తతంగమేనని కాంగ్రెస్ చెప్పుకుంది కూడా. వురో విధంగా చెప్పాలంటే ఉభయుుల వుధ్య పెద్ద తేడా లేదని వారూ అంగీకరిస్తున్నారన్నవూట.
 
 ప్రపంచ బ్యాంకు బాటే
 నిజంగానే ఆర్థిక అంశాల్లో బీజేపీ ప్రణాళిక కాంగ్రెస్ కంటే భిన్నంగా లేదు. కాంగ్రెస్ ప్రణాళికలో గత రెండుసార్లు ప్రవుుఖంగా కనిపించిన ఆమ్ ఆద్మీ అదృశ్యమై ఘరానా ఆద్మీని ఆనందపర్చడమే ప్రధానంగా తయూరైంది. అంతర్జాతీయు పెట్టుబడిదారులు భారతదేశంపై విశ్వాసం కోల్పోయూరనీ దాన్ని పునరుద్దరించాలనీ బీజేపీ ప్రణాళిక చెబుతోంది. ఇందుకోసం అర్థికాభివృద్ధి క్రవూన్ని వేగవంతం చేసేందుకు వాణిజ్య వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానచట్రాన్ని తీసుకొస్తానని అన్నది. వారికి సులభంగా అనువుతులు లభించే ఏక గవాక్ష విధానాలు, పెట్టుబడులు, పరిశ్రవులకు ఏ ఆటంకమూ లేని పర్యావరణ విధానం తీసుకొస్తానని వూటిచ్చింది.
 
 ఉపాధి, ఉద్యోగాల కల్పన గురించి ఉభయు పార్టీలూ ఊదరగొట్టారుు గానీ, అందుకవసరమైన విధాన వూర్పులను మాత్రం చెప్పింది లేదు. ద్రవ్య నియుంత్రణను వురింత బిగించి లోటును తగ్గించాలన్న ప్రపంచబ్యాంకు ఆదేశాల అవులుకు కట్టుబడి ఉన్నట్టు ఉభయు పార్టీలూ పేర్కొన్నారుు. ద్రవ్య లోటును వుూడు శాతానికి తగ్గిస్తావుని కాంగ్రెస్ చెబితే, కఠినంగా అవులు చేస్తావుని బీజేపీ చెప్పింది. లోటు తగ్గింపు పోటు సావూన్యులకు ఉపయోగపడే సంక్షేవు, సహాయు పథకాలపై, సబ్సిడీ మొత్తాలపై పడుతుందనేది అనుభవం. బీజేపీ ప్రణాళిక అక్షరాలా ఆ దిశలోనే ఉంది.
 
 ఆర్థిక రంగంలో కార్పొరేట్ ఎజెండా ఒకటైతే మతతత్వ అంశాలను చొప్పించడం అంతకన్నా ఆందోళన కలిగించే విషయం. బీజేపీ వాటిని ఎన్నడూ వదులుకోలేదనేది తెలిసిందే. మోడీత్వ నమూనాలో వాటిని పునరుద్ఘాటించడం ద్వారా మరోసారి వాతావరణాన్ని కలుషితం చేసేందుకు అది తెగబడినట్టు అర్థమైపోతుంది. రామమందిరం నిర్మాణాన్ని రాజ్యాంగ పరిధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామంటూనే, త్వరితంగా కట్టేస్తామని చెప్పడం ఇందుకు నిదర్శనం. ఇక జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి సివిల్ కోడ్ రుద్దడం వంటి పాత ఫార్మూలాలనే కాస్త అటూ ఇటూగా పునరుద్ఘాటించారు. ఉమ్మడి సివిల్ కోడ్ వినడానికి బావుంటుంది గానీ, దాని చుట్టూ జరిగిన ప్రచారం అదేదో మైనారిటీల కోసమేనన్న భావనను ధ్వనింపజేస్తుంది. వాస్తవానికి హిందూ మత సంబంధమైన చట్టాలలోనూ లొసుగులు అనేకమున్నాయి. మహిళల హక్కుల విషయంలో మతాల ధోరణి దాదాపు ఒకటిగానే ఉంటుంది. అయినా సరే స్వాభావికంగానే బీజేపీ ఈ చర్చను అలా దారి తప్పించింది. ఎందుకంటే ఇవన్నీ పరివార్ మూల సూత్రాలు.
 
 ఇక గోవధ, పశుమాంసం వంటి విషయాలను  మోడీ అసంబద్ధంగా లేవెత్తి అభాసు పాలయినప్పటికీ ప్రణాళికలోనూ వాటికి మరో రూపంలో చోటు కల్పించడం మత చాంధసులను సంతృప్తి పరచడానికి అక్కరకు వస్తుంది. వాజ్‌పేయి ఉదారవాద ముసుగులోనైనా, ఇప్పుడు మోడీ అభివృద్ధి ముసుగులోనైనా బీజేపీ మౌలిక సూత్రాలు మారలేదన్నది నిజం. బీజేపీలో శాశ్వత అసమ్మతివాది మాత్రమే గాక ఈ ప్రణాళికకు రూపకర్త కూడా అయిన మురళీ మనోహర్ జోషీ వీటిని సాంస్కృతిక కోణంలో తప్ప మతతత్వం కింద చూడరాదంటూ సమర్థించడం విడ్డూరం! ఏమంటే బీజేపీ నిజానికి ఆరెస్సెస్, సంఘ పరివార్‌లో అంతర్భాగమని వారి అధికారిక వెబ్‌సైట్‌లోనే రాసుకున్నారు. తమ కీర్తి మొత్తం సంఘ్ పుణ్యమేనని చెప్పడం ద్వారా వాజ్‌పేయి నుంచి మోడీ దాకా ‘నాగపూర్ విధేయత’ను చాటుకుంటూనే ఉన్నారు.
 
 అద్వానీ అంతటి అతిరథుడి అభ్యంతరాలను బేఖాతరు చేసి మోడీని నెత్తికెత్తుకోవడానికి కారణం పరివార్ ఆశీర్వచనాలే. అసలు సంఘ్ నుంచి నేరుగా బాధ్యతల్లోకి దూకిన మొదటి నేత మోడీయే. ఇన్ని చర్చలు, పొగడ్తల్లో ఎక్కడా ఆయన హయాంలో జరిగిన గుజరాత్ మారణకాండను గురించిన విచారం, లేదా విమర్శ లేశమాత్రమైనా కనిపించకపోవడం గమనించదగ్గది. వాటికి సంబంధించి పశ్చాత్తాపం, లేదా క్షమాపణల ప్రసక్తి లేదని మోడీ అధికారికంగా ప్రకటించారు కూడా. అణు ఒప్పందం వంటి వాటిపై కూడా సన్నాయి నొక్కులు తప్ప సూటిగా దేశప్రయోజనాలు కాపాడతామన్న మాట లేదు. పైగా మొదటగా వాడబోతున్న ప్రస్తుత విధానాన్ని సమీక్షిస్తామన్న మాట చేర్చడం ద్వారా దుందుడుకు ధోరణిని పరోక్షంగా ప్రదర్శించుకుంది. మోడీ ప్రధాని అయితే నేపాల్ తిరిగి హిందూ రాజ్యమవుతుందని, ఇరుగుపొరుగు దేశాలు దారికి వస్తాయని వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ కఠ్మాండులో చెప్పిన మాటలు, మోడీ స్వయంగా చేసిన కొన్ని ప్రసంగాలు కూడా ఈ కోవలోనే ఉన్నాయి. ఏతావతా దేశంలోనూ, దేశం వెలుపల కూడా వివాదాలనూ, విభజనలనూ పెంచే దిశలోనే  మోడీత్వ నడుస్తుందనేది నిజం.
 
 అందుకు భిన్నమైన ప్రగతిశీల, ప్రజాస్వామిక అంశాలేవీ ఈ ప్రణాళికలో లేవన్నది యథార్థం. ‘మోడీయా’గా మారిపోయిన మీడియాలో ఒక భాగం వీటినే ఆకాశనికెత్తి కీర్తిస్తున్నదంటే వారికి లౌకిక, ప్రజాస్వామిక విలువల పట్ల విశ్వాసం లేకపోవడమే కారణం. తన మాటలు తానే దిగమింగిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వంటివారు దేశాన్ని మోడీ ఉద్ధరిస్తాడంటూ ఆయనతో జట్టుకట్టడం కూడా ఆ కోవ లోదే. నమో దేశాయ అనడమంటే లౌకిక నాశాయ అనడమే.
 
 సాగుకు పెను ముప్పు
 ధరల స్థిరీకరణ, ద్రవ్యోల్బణం తగ్గింపు వంటి ఊకదంపుడు కూడా తాడూ బొంగరం లేనిదే. చౌక ధరల సరఫరాలను పెంచకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయుకుండా ఇవన్నీ సాధ్యం కావు. కానీ బీజేపీ ప్రణాళికలో ఆ ఊసే లేదు. పైగా బహుళ బ్రాండ్లు మినహా తక్కిన అన్ని వ్యాపారాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతిస్తాననే వైఖరి తీసుకుంది. అంతకంటే ప్రమాదం... వ్యవసాయ రంగంలో ఎఫ్‌డీఐలకు ద్వారాలు తెరిచేందుకు సిద్ధమైంది.
 
 ఇది చిల్లర వ్యాపారం కన్నా ప్రమాదకరం. ఈ విధానపరమైన నిర్ణయాలు చాలనట్టు నేరుగా పన్నుల తగ్గింపుపైనా వరాల వర్షం కురిపించింది. సంపన్నులు, పెట్టుబడిదారుల పాలిట భారతదేశం పన్నుల టైజం సాగిస్తోందనీ, తాము వాటిని సరళతరం చేస్తామని ప్రకటించింది. నిజంగా ఉపాధి కల్పన, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల నిర్మాణం వంటివి జరగాలంటే అదనపు వనరులు కావాలి. వాటిని సహస్ర కోటీశ్వరుల నుంచి, కార్పొరేట్ కుబేరుల నుంచి రాబట్టాలి. కాని వారికే సులభతర షరతుల హామీ ఇవ్వడం మోడీత్వ సారాంశాన్ని పట్టి చూపే ఉదాహరణ. భూ సేకరణ బిల్లు ఎట్టకేలకు ఈ మధ్యనే ఆమోదం పొందగా దాన్ని కూడా సమీక్షిస్తానని చెప్పడం ద్వారా ఆ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. కనుక ఈ ప్రణాళికలో సామాన్య ప్రజల కోణం కన్నా సంపన్న వర్గాలను, దేశ విదేశీ గుత్తాధిపతులను సంతృప్తిపరిచే తతంగమే అత్యధికం.

మరిన్ని వార్తలు