మందమర్రి బల్దియాకు ఎన్నిక జరిపిస్తా:కేసీఆర్

29 Apr, 2014 01:43 IST|Sakshi
మందమర్రి బల్దియాకు ఎన్నిక జరిపిస్తా:కేసీఆర్
  •  అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి పని ఇదే..
  •  టీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించండి
  •  కాంగ్రెస్ నాయకులవి ఆచరణకు సాధ్యం కాని హామీలు
  •  డిస్మిస్డ్ కార్మికులకు ఉద్యోగాలిస్తాం..మందమర్రి బహిరంగ సభలో కేసీఆర్
  •  సాక్షి, మంచిర్యాల : టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో కొందరు చేసే గోల్‌మాల్‌కు మోసపోవద్దని కోరారు. మందమర్రి సోమవారం సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ అని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఆచరణ సాధ్యం కాదన్నారు. తాను చెప్పినట్లు రూ.లక్ష మాఫీ చేస్తేనే ఏటా రూ.12,000 కోట్లు అవసరం అవుతాయని, అలాంటిది రూ.2 లక్షలు మాఫీ చేస్తే రూ.24,000 కోట్లు కావాలని అన్నారు. ఆ హామీ కాంగ్రెస్ కాదు కదా.. తాను అధికారంలోకి వచ్చినా అమలు చేయలేనని చెప్పారు. అబద్ధాలు చె ప్పడం తన వల్ల కాదని అందుకే రూ. లక్ష రుణమాఫీ అని మా త్రమే ప్రకటించినట్లు తెలిపారు. తన హామీలపై విమర్శలు చే సిన కాంగ్రెస్ ఇప్పుడు అంతకు రెట్టింపు హామీ ఇవ్వడాన్ని ఏ మనుకోవాలని ప్రశ్నించారు.
     
    ఆటోలకు రవాణా పన్ను, ట్రాక్ట ర్లు, ట్రాలీలకు సుంకం ఎత్తివేస్తామని ప్రకటించారు. వృద్ధుల కు, వితంతువులకు రూ.1,000, వికలాంగులకు రూ.1,500 పింఛన్ అందజేస్తామని చెప్పారు. సింగరేణి ఉద్యోగులకు ప్ర త్యేక ఇంక్రిమెంటు, సకల జనుల సమ్మె సమయంలో కోత వి ధించిన సొమ్ము జమచేస్తామని, డిస్మిస్డ్ కార్మికులను ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాల్క సుమన్, నల్లాల ఓదెలు గెలిచినట్లు తన దగ్గర రిపోర్టు ఉందన్నారు. బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర నేతల ఆలోచనలకు అనుగుణంగా ఆ పార్టీ నడుచుకుంటోందని విమర్శించారు.

మరిన్ని వార్తలు