నేనెందుకు ఓటెయ్యాలి?

10 Apr, 2014 11:17 IST|Sakshi

నేను ఓటెయ్యను గాక వెయ్యను....



ఎందుకంటే నాకు పోలింగ్ బూత్ లో క్యూ కట్టి నిలుచుండటమంటే అస్సలు ఇష్టం ఉండదు. అది పరమ బోరింగ్ పని. కావాలంటే అదే రోజు గంటల పాటు సినిమా క్యూలో నిలుచుంటాను. కానీ మెడమీద తలకాయ ఉన్నవాడెవడైనా ఓటేస్తాడా?

ఓటరు ఐడీ కార్డు కోసం ఎవడు అప్లై చేస్తాడు? దాని కోసం అంత హోమ్ వర్క్ చేసే టైమ్ ఎవరికి ఉంది? ఓటరు లిస్టులో నా పేరు నమోదు చేయించుకోవడమంటే చాలా కష్టం. కావాలంటే నాకు నచ్చిన చెప్పుల కోసం పది దుకాణాలు, ఇరవై వీధులు తిరుగుతాను కానీ ఓటరు ఐడీ కోసం గవర్నమెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతానా? సో అన్ ఫేషనబుల్....!

ఎవడు అధికారంలో వస్తే నాకేమిటి? నాకు రాజకీయాలంటే పరమ బోర్... అసహ్యం. నేను పేపరు కొనను. కొన్నా స్పోర్ట్స్, సినిమా వార్తలు చదివి మిగతాది పక్కన పారేస్తాను. రాజకీయనాయకులందరూ అవినీతిపరులే. నాగారావు అయితేనేం, సర్పారావు అయితేనేం? అందరూ ఒక్కటే.
 
నా ఒక్క ఓటుతో ఏం చేయగలను? నేను ఓటేసినా, వేయకపోయినా పెద్ద తేడా ఏముంటుంది? అసలు వోటెందుకు వేయాలి?

 చాలా సంతోషం సర్! మన బాధ్యత మనం నెరవేర్చం. కాబట్టి మనకు తగ్గ ప్రభుత్వాలొస్తాయి. ఆ తరువాత అయిదేళ్ల పాటు లబో దిబో. ఓటెయ్యకుండా ఉండేందుకు కోటి కారణాలు. ఓటేసేందుకు మాత్రం ఒకే కారణం. ఓటు మన హక్కు. ఓటు మన దిక్కు.
అందుకే బద్ధకం వదలి... కావాలంటే ఓ కప్పు కాఫీ తాగి మరీ ఓటేయండి.

మరిన్ని వార్తలు