ట్విట్టర్‌లో 2.30 కోట్ల మంది

13 Aug, 2014 23:45 IST|Sakshi
ట్విట్టర్‌లో 2.30 కోట్ల మంది

‘ఆటోమేటిక్’ యూజర్లు!!

సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో ఖాతాలను నెలకు ఒక్కసారైనా ఓపెన్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్నవారు మొత్తం 27.10  కోట్ల మంది. అయితే వీరిలో దాదాపు 2.30 కోట్ల మంది యూజర్లు అసలు పట్టించుకోకపోయినా వారి ట్విట్టర్ అకౌంట్లు నెలనెలా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతున్నాయట. స్వయంగా ట్విట్టర్ వెబ్‌సైట్‌వారే ఈ సంగతి వెల్లడించారు.

అధికారిక వెబ్‌సైట్, మొబైల్ ఆప్స్ నుంచి కాకుండా ఇతర ప్రోగ్రామ్‌ల ద్వారా ట్విట్టర్‌ను వాడుతూ యాక్టివ్‌గా ఉంటున్నవారు 14 శాతం మంది ఉండవచ్చంటూ ఆ వెబ్‌సైట్ ఇంతకుముందు ప్రకటించింది. అయితే ఆ ప్రకటనను సవరిస్తూ తాజాగా.. యూజర్లు ఉపయోగించకున్నా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతున్న అకౌంట్లు 8.5 శాతమే ఉన్నాయని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు