‘విరూప’మవుతోన్న వ్యవస్థాపకులు! | Sakshi
Sakshi News home page

‘విరూప’మవుతోన్న వ్యవస్థాపకులు!

Published Thu, Aug 14 2014 1:07 AM

Great place for museum or buddhism enthusiasts

 షేక్ మహ్మద్ జాన్ ‘స్టోన్ సర్జన్’! నాగార్జునకొండ మ్యూజియంలో బుద్ధుడు, అమరావతిలోని నంది - గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం - హంపిలో యోగ లక్ష్మీనరసింహుడు - అంకోర్‌వాట్‌లో అప్సరసలు... జాన్ చేతిలో పునరాకృతులు పొందినవే!
 
 ‘తెలుగు వారి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటికాదగ్గ అంశం ఒక్కటీ లేదా? ఉంది! అంటున్నారు, షేక్ మహ్మద్ జాన్! ఎవరాయన?  ‘స్టోన్ సర్జన్’! నాగా ర్జునకొండ మ్యూజియంలో బుద్ధుడు, అమరావతిలో  నిల్చున్న నంది - గుడి మల్లం పరశురామేశ్వర ఆలయం - హం పిలో యోగ లక్ష్మీనరసింహుడు- అంకోర్ వాట్‌లో అప్సరసలు... జాన్ చేతిలో పునరాకృతులు పొంది నవే! 77 ఏడేళ్ల జీవితంలో ఐదు దశాబ్దాలకు పైగా భారత పురావస్తుశాఖకు సేవలు అందించిన జాన్  వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌గా యునెస్కొ గుర్తించిన ‘హంపి - పునర్నిర్మాణం’ లో పాల్గొన్నారు. ఎస్.ఎం.జాన్‌తో ఇంటర్వ్యూ సారాంశం:
 
 పుట్టుకతో రాగల ఆరోగ్యసమస్యలను మూలకణాలు పరిష్కరిస్తాయి. ఒక సమాజానికి రాగల సాంస్కృతిక సమస్యలకు మూలపురుషుల జీవితాలు పరిష్కారాన్ని చూపుతాయి. కాబట్టే ‘ఫౌండింగ్ ఫాదర్స్’ ఆయా సమా జాల పాఠ్యాంశాల్లో జీవించి ఉంటారు! ఈ నేపథ్యంలో సమస్త దక్షిణ భారత దేశాన్నీ ప్రభావితం చేసిన విజయ నగర సామ్రాజ్య (క్రీ.శ. 1336-1556) వ్యవస్థాపకుల గురించి తెలుసుకోవడం అభిలషణీయమే కదా! దురదృష్టవ శాత్తూ ఈ విషయమై మనకు స్పష్టత లేదు!
 
 కాకతీయ ఆర్గ్యుమెంట్!
 హరిహరరాయలు-బుక్కరాయలు (రాయ సోదరులు) కాక తీయ సామ్రాజ్యపు కోశాధికారులు. ఢిల్లీ సుల్తానులు ఓరుగ ల్లును ఆక్రమించడంతో దక్షిణానికి ప్రయాణించి, కంప్లి (బళ్లారి జిల్లా) రాజైన రామనాధుని ఆశ్రయం పొందారు. కంప్లి సైతం ఢిల్లీకి తలవంచిన నేపథ్యంలో బందీలుగా ఢిల్లీ వెళ్తారు. మతం మార్చు కుని, తమ ‘సత్ప్రవర్తన’ తో సుల్తానుల ఔదా ర్యంతో గవర్నర్ల హోదా తో కంప్లి వస్తారు. ఢిల్లీలో అస్థిరత ఏర్పడిన నేపథ్యం లో, విద్యారణ్యుల వారి ఆశీశ్సులతో హంపి (ఆనె గొంది)లో హిందూ రా జ్యాన్ని (క్రీ.శ.1336) స్థాపిస్తారు. ఈ వాదనను ప్రొ. వేంకటరంగయ్య, నీలకంఠశాస్త్రి, లూయీస్ రైస్,ఏ.వి.స్మిత్, రాబర్ట్ సీవెల్ తదితరులు చారి త్రక ఆధారాలతో నిర్ధారిం చారు. విద్యారణ్య కాల జ్ఞానం, విద్యారణ్య వృ త్తాంతం, విశ్వనాధరత్నా కరం తదితర గ్రంథాలు కూడా ‘కాకతీయ ఆర్గ్యుమెంట్’గా ప్రాచుర్యంలో ఉన్న పై అంశాలనే సమర్థిస్తున్నాయి!
 
 కన్నడ కథనాలు!
 ‘రాయ సోదరులు’ హంపీ స్థానికులని, ఇక్కడే పుట్టారని, హంపి విరూపాక్ష స్వామి వీరి కులదైవమని, రాజముద్రికలో కూడా విరూపాక్షుడే ఉన్నాడని, వీరు ఈ ప్రాంతపు సంగమ -యాదవ రాజుల బంధువులని, హోయసల రాజులతో వైవాహిక సంబంధాలున్నాయని కన్నడ పండితులు వాదిస్తు న్నారు. పాఠ్యాంశాలు, పర్యాటక సాహిత్యం హరిహర బుక్కరాయలు కన్నడిగులనే తెలియజేస్తున్నాయి! ‘రాయ సోదరుల’ గురించి పై మాటలకు పరిమితమవుతూ వారి ‘ఆచూకీ’ని అన్వేషించడంలో తగిన ‘చొరవ’ చూపడం లేదు!
 
 విరూపాక్ష ప్రాకారంపై ‘రాయ-సుల్తానులు’!
 హంపి క్షేత్రం దాదాపు 5 లక్షల చదరపు హెక్టార్లలో వ్యాపించి ఉంది. 1,600 కట్టడాల్లో లక్షలాది శిల్పాలున్నాయి. వీరిలో హరి-హరబుక్కరాయలు ఉన్నారా? ఉంటే గుర్తించడం ఎలా?  హంపి విరూపాక్షస్వామి ఆలయ ఉత్తర ప్రాకారం (తుంగభద్రానది వైపు) పై  ఇరువురు రాకుమారుల శిల్పా లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇరువురూ భక్తుల వేషధారణలో, ఇరువైపులా అంగరక్షకులతో  దేవతలకు అంజలి ఘటిస్తూ నిల్చుని ఉంటారు. తలపాగా, గడ్డమూ, చిరుకత్తి వంటి ఆహార్యంతో ‘సుల్తానులా?’ అన్పిస్తారు ! వీరిలో హిందూ - ముస్లిం చిహ్నాలు కన్పిస్తాయి! ఎందువల్ల? ఢిల్లీ నుంచి గవర్నర్లుగా ప్రస్తుత హంపి ప్రాంతానికి వచ్చిన కొత్తలో ‘రాయ సోదరులు’ ఈ వేషధారణలో ఉండి ఉండాలి! విరూపాక్ష దేవస్థానాన్ని అభివృద్ధిపరచే సమయంలో శిల్పులు ‘మిశ్రమ’ వేషధారణలోని రాయసోదరులకు ఆకృతి ఇచ్చి ఉంటారు!
 
 శిథిలమైన బుక్కరాయలు!
ఫిలిమ్స్ డివిజన్ కొన్ని దశాబ్దాల క్రితం రూపొందించిన ‘ద ఫర్‌గెటన్ ఎంపైర్’లో రెండు విగ్రహాలు ఉన్నాయి.ఆ రెండు  విగ్రహాల్లో ప్రస్తుతం ఒక్కటే ఉంది! శిథిలమైంది ఎవరు? సాంప్రదాయాల ప్రకారం మిగిలి ఉన్నది పెద్దవాడైన హరిహరరాయలుగా భావించవచ్చు! ఆయనను  కాపాడు కోవాల్సిన బాధ్యత  కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై, తెలుగు వారందరిపై ఉంది!
 - పున్నా కృష్ణమూర్తి

Advertisement

తప్పక చదవండి

Advertisement