బ్యూటిప్స్‌

29 Oct, 2018 00:37 IST|Sakshi

ఒక్కొక్కసారి స్నానం చేసినా, ఏ సబ్బుతో ముఖం కడిగినా తాజాగా ఉన్నట్లనిపించదు. కాలుష్యం చర్మరంధ్రాల్లో పట్టేసినప్పుడు, జిడ్డు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఈ సమస్య పోయి ముఖం తాజాగా, శుభ్రంగా ఉండాలంటే బొప్పాయి గుజ్జు చక్కని మందు. మామూలుగా ప్యాక్‌కు వాడేకంటే ఎక్కువ మోతాదు గుజ్జు అవసరమవుతుంది. ముందుగా సగం గుజ్జును ముఖానికి, మెడకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత తుడిచేసి ముఖానికి ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టిన తరువాత మిగిలిన గుజ్జుతో ప్యాక్‌ వేయాలి. ప్యాక్‌ ఆరిన తరువాత చన్నీటితో కడగాలి.
 స్వచ్ఛమైన బాదం నూనె చర్మానికి చక్కని టానిక్‌లా పని చేస్తుంది. మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీమ్‌లు, లోషన్లకు బదులుగా ఆల్మండ్‌ ఆయిల్‌ వాడకం మంచి ఫలితాలనిస్తుంది. చలికాలంలో అన్ని రకాల చర్మతత్త్వాల వాళ్లూ దీనిని వాడవచ్చు. ముఖంతోపాటుగా చేతులు, కాళ్లకు కూడా (చలికి ఎక్స్‌పోజ్‌ అయ్యేంత వరకు) రాస్తుంటే మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, చర్మం మీదున్న మచ్చలు, గీతల వంటివి తొలగిపోతాయి.

మరిన్ని వార్తలు