ఎంత ఘాటు ప్రేమయో!

30 Mar, 2016 00:22 IST|Sakshi
ఎంత ఘాటు ప్రేమయో!

తిండి గోల
చూడటానికి చిన్నగా ఉన్నా, రుచికి మాత్రం ఘాటే. కొన్ని వంటకాలలో అవి పడకపోతే రుచించదు. అవే మిరియాలు. రాములోరి పానకంలో మిరియాల పొడి పడలేదా... ఇక అది పానకం కాదు... కల్లుకిందే లెక్క! చక్రపొంగలిలో, దధ్యోదనంలో, తిరుమలేశునికి నివేదించే పులిహోరలో పంటికింద మిరియాలు తగిలితేనే పసందు. బ్లాక్ పెప్పర్‌గా ఆంగ్లేయులు పిలుచుకునే మిరియాలకు ఓ స్పూను జీలకర్ర చేర్చి, వాటిని కచ్చాపచ్చాగా దంచి, ఓ స్పూను నేతిలో వేసి వేగించామా...

ఎంత జటిలమైన జలుబూ ఎగిరిపోవాల్సిందే! ఈ క్రోసిన్లు, కోల్డారిన్లు రాకముందు పడిశం పడితే అదే పెద్ద మందు. అంతేనా.. అజీర్తితో నోటికి అరుచిగా అనిపించినప్పుడు చిటికెడు ఉప్పూ మిరియాల పొడీ జీలకర్ర, చిన్న అల్లంముక్క కలిపి నేతిపోపు పెట్టి మొదటి ముద్దలో తింటే... ఆకలి... అని గెంతవలసిందే ఇక! మిరియాల చారెడితే ఎంతదూరంలో ఉన్నా గుబాళిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నీళ్లలో కొన్ని మిరియాలు, చక్కెర కలుపుకుని తాగితే జ్వరం తొందరగా తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది..

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు