పాశుర ప్రభాతం

23 Dec, 2017 00:32 IST|Sakshi

8వ పాశురం
కీళ వానమ్‌ వెళ్లెజ్జ్ఎరుమై శిఱువీడు మేయ్‌వాన్‌ పరందన కాణ్‌! మీక్కుళ్ల పిళ్లైగళుమ్‌ పోవాన్‌ పోగినాజ్జ్ ప్పోగామల్‌ కాత్తున్నై కూవువాన్‌ వందు నిన్నోమ్‌ కోదుకలముడైయ పావాయ్‌! ఎళుందిరాయ్‌ పాడి ప్పఱై కొండు వావాయ్‌ విళందానై మల్లరై మాట్టియ దేవాది దేవనై చ్చెజ్జ్ నామ్‌ శేవిత్తాల్‌ ఆవా వెజ్జ్ఆరామ్‌ందు అరుళే లోరెమ్బావాయ్‌.

భావం: తూర్పుదిక్కు తెల్లవారుతోంది. పచ్చిక మేయడానికై చిన్న బీడులోనికి విడువబడిన గేదెలు విచ్చలవిడిగా వెళుతున్నాయి. మిగిలిన గోపికలందరూ వ్రతస్థలానికి బయలుదేరి పోవడమే తమకు ప్రయోజనం అనునట్లు పోతున్నారు. వారిని ఆపి నిన్ను పిలుచుటకు మేము నీ వాకిట్లో వచ్చి నిలిచి యున్నాం. కుతూహలం కలిగిన ఓ పడతీ! లేచి రావమ్మా! కృష్ణ భవవానుని గుణాలను కీర్తించి వ్రతాన్ని ప్రారంభించి వ్రతసాధనమైన పరను పొందుదాం. కేశి అను రాక్షసుని చీల్చి చంపిన వానిని... చాణూర ముష్టికులని మట్టుపెట్టిన వానిని దేవాధిదేవుణ్ణి మనం వెళ్లి సేవించెదము. అప్పుడు స్వామి మనతో ‘అయ్యో! మీరే వచ్చితిరా’ అని బాధపడి తదుపరి మన మంచి చెడులను పరిశీలించి మనలను కటాక్షిస్తాడు. ప్రేమతో చూస్తాడు.
– ఎస్‌. శ్రీప్రియ

మరిన్ని వార్తలు