ఈ ఫేస్‌బుక్కుంది చూశారూ...

26 Mar, 2015 08:54 IST|Sakshi
ఈ ఫేస్‌బుక్కుంది చూశారూ...

దశాబ్దం క్రితం నాటి  ‘యంగ్ టీనేజర్లు’తో పోల్చితే ఈనాటి ‘ఫేస్‌బుక్ జెనరేషన్’ఆరోగ్యంగా, ఆనందంగా ఉందని  తాజా అధ్యయనం చెబుతుంది. సెయింట్ ఆండ్రూస్ యూనివర్శిటీ(ఇంగ్లండ్)కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు.   ఇందుకు  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్‌లను కూడా ఉపయోగించుకున్నారు.

మద్యపానం, ధూమపానం, పొగాకు నమలడం...తదితర చెడు అలవాట్ల వైపు వీలైనంత వరకు మొగ్గు చూపకుండానే ఈ జనరేషన్ టీనేజర్లు ప్రయత్నిస్తున్నారు. కూరగాయలు, ఫలాలు తినడానికి, వ్యాయమాలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు.

గతంతో పోల్చితే ఆరోగ్యం, ఆనందం విషయంలో మెరుగ్గా ఉండడానికి  ఫేస్‌బుక్కే కారణమంటున్నారు కొందరు పరిశోధకులు.
 ‘‘ఫేస్‌బుక్‌లో పడిపోయిన వాళ్లకు వేరే ప్రపంచమే పట్టదు. ఇక చెడు అలవాట్లు ఎలా దరి చేరుతాయి!’’ అన్నారు పరిశోధకులలో ఒకరు హాస్యంగా. దీనికి ‘ఫేస్‌బుక్ ఎఫెక్ట్’ అని కూడా పేరు పెట్టారు కూడా.
 

మరిన్ని వార్తలు