రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

16 Nov, 2023 16:26 IST|Sakshi

ఈ మధ్య కాలంలో చాలామందిని పీడిస్తున్న సమస్య నిద్రలేమి. బిజీ లైఫ్‌ షెడ్యూల్‌ కారణంగా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. నిద్ర కష్టాలు చిన్నవిగా అనిపించినా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర లేకపోవడం వల్ల రోజంతా తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. కంటినిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం భద్రంగా ఉంటుంది.  ఆరోగ్యకరమైన నిద్రకు 10 చిట్కాలు పాటిస్తే సరి.అవేంటో చూద్దామా

ఆరోగ్యకరమైన నిద్రకు 10 చిట్కాలు

  •  నిద్రపోవ‌డానికి, నిద్రలేవ‌డానికి ఒక స‌మ‌యాన్ని కేటాయించండి.
  •  పగలు నిద్రపోయే అలవాటు ఉంటే, దాన్ని 30 నిమిషాలకు మించకుండా చూసుకోవాలి.
  •  నిద్రవేళకు 4 గంటల ముందు మద్యం తీసుకోవడం,ధూమపానం చేయవద్దు.
  •  నిద్రవేళకు 6 గంటల ముందు కెఫిన్ మానుకోండి.
  • నిద్రవేళకు 4 గంటల ముందు ఎక్కువ‌గా, కారంగా లేదా చక్కెర కలిగిన ఆహారాన్నితీసుకోవ‌ద్దు. నిద్రపోవ‌డానికి ముందు తేలికపాటి చిరుతిండి తీసుకోవ‌డం మంచిది.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, కాని నిద్రపోయే ముందు చేయ‌డం మంచిది కాదు.
  • సౌకర్యవంతమైన పరుపులను వాడండి.
  • దీనితో పాటు, ఉష్ణోగ్రత కూడా నిద్రకు అనుకూలంగా ఉండాలి. చాలా వేడి, చల్లని వాతావరణంలో కూడా నిద్రపోలేరు కాబట్టి సరైన టెంపరేచర్‌ ఉండేలా వెంటిలేషన్‌ ఏర్పాటు చేసుకోండి.
  • నిద్రపోయే ముందు శ‌బ్ధాల‌కు దూరంగా ఉండండి.
  • బెడ్ రూంలో సాధ్యమైనంత ఎక్కువ కాంతి ఉండకుండా చూడండి.

మరిన్ని వార్తలు