కిచెన్‌లో దొరికే వస్తువులతోనే అందంగా మెరిసిపోండిలా..

16 Nov, 2023 16:37 IST|Sakshi

అందంగా కనిపించాలనే కోరికి ఎవరికి మాత్రం ఉండదు? కానీ అందుకు తగ్గట్లు తగిన శ్రద్ద తీసుకోవాలి. స్కిన్‌ కేర్‌ కోసం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న అవగాహన చాలామందికి ఉండదు. చర్మంపై ఏవేవో ప్రయోగాలు చేస్తూ వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. కానీ సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూద్దాం.

 కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్‌ని రిమూవ్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 
కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్‌టోన్‌ని సాఫ్ట్‌గా చేస్తుంది.

 ఒక బౌల్‌లో హాఫ్‌ కప్‌ అవకాడో గుజ్జు తీసుకోండి. అందులో 1 టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌.. 2 చుక్కల తేనె వేసి బాగా కలపండి. ఆ మిక్సర్‌ని మొహానికి అప్లయ్‌ చేసి.. 15 మినట్స్‌ వరకు అలాగే ఉంచేయండి. తర్వాత కోల్డ్‌ వాటర్‌తో ఫేస్‌ వాష్‌ చేసుకోండి.  

 కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది.

ఒక కప్పు గ్రీన్ టీని బ్రూ చేసి చల్లారనివ్వండి. దీన్ని స్కిన్ టోనర్‌గా ఉపయోగించండి. ఇది స్కిట్‌టోన్‌ని పెంచుతుంది. 

 అయితే ఎంత స్కిన్‌ కేర్‌ పాటించినా నిద్ర కూడా అంతకంటే ఎక్కువే ముఖ్యం. రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. 

మరిన్ని వార్తలు