కూరల్లో ఆలివ్‌ ఆయిల్‌ వాడుతున్నారా? ఏమవుతుందో తెలుసా?

16 Nov, 2023 16:04 IST|Sakshi

మనం తినే ఆహారం మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చాలామంది రోజంతా మందకొడిగా ఉన్నట్లు ఫీలవుతుంటారు.మంచి పోషకాలు, విటమిన్లు ఉండే ఆహారం తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం.

వాల్‌నట్స్‌ను రోజూ తీసుకోవడం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వాల్‌నట్స్‌లోని ప్రోటీన్‌ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరుకు చక్కగా పనిచేస్తాయి. ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల,  మెమరీ పవర్ మెరుగుపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

► చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు మెరుగుపరచడానికి చక్కగా పనిచేస్తాయి. చేపలను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది.
► స్ట్రాబెర్లీలు మెదడు చురుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది.షఆహారంలో ఎక్కువగా ఉడికించిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలతో ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
► నట్స్‌ ఆహారంలో అధికంగా ఉండేలా డైట్‌ ప్లాన్‌ చేసుకోవడం మంచిది.
► మాంసాహారం ఇష్టమైతే, దానితోపాటు ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోండి. 

► ఆహారంలో వాడే నూనెలకు బదులు ఆలివ్‌ ఆయిల్‌ ఉండేలా చూసుకోండి. ∙రోజులో ఎక్కువసార్లు నీళ్లు తాగండి.
► కాఫీ, టీ లను పరిమితంగా తీసుకోండి. ఒకవేళ తాగాల్సి వస్తే దానికి బదులు గ్రీన్‌ టీ, లెమన్‌ టీ వంటివి తీసుకోండి.
ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకోడానికి బదులు తాజా పళ్లను తీసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు