ఫ్యామిలీ డాక్టర్‌

18 Jan, 2018 01:18 IST|Sakshi

ఫైబ్రాయిడ్స్‌ సమస్య తగ్గేదెలా? 

నా వయసు 42 ఏళ్లు. కొంతకాలంగా ఫైబ్రాయిడ్స్‌ సమస్యతో బాధపడుతున్నాను.  డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్సతో వాటిని తొలగించాలని, అయితే భవిష్యత్తులో మళ్లీ రావచ్చని అంటున్నారు. దాంతో ఆందోళనగా ఉంది. మాటిమాటికీ తిరగబెట్టకుండా హోమియో చికిత్సతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుందా? 
– మాధవి, చిత్తూరు 

గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. 

కారణాలు : ఫైబ్రాయిడ్స్‌ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. 

లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసా గడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్‌ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. 

చికిత్స: జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

బాబు సమస్య ఏడీహెచ్‌డీ కావచ్చు! 
మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఒక చోట కుదురుగా ఉండడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్‌ నుంచి ఎవరో ఒక టీచర్‌ మావాడి ప్రవర్తన గురించి కంప్లయింట్‌ చేస్తుంటారు. మా వాడి ప్రవర్తనకు కారణం ఏమిటి? హోమియోలో వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? 
– పి.ఎస్‌.మూర్తి, కొత్తగూడెం 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) అనే సమస్య ఉందని అనిపిస్తోంది. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధార ణంగా ఏమీ గుర్తుండదు. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. 

సమస్యకు కారణాలు : ∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు. 

లక్షణాలు : ∙మతిమరపు, తలనొప్పి ∙ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు.

మానసిక స్థితి చక్కగా లేకపోవడం ∙ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం. 

∙ఇతరులను ఇబ్బంది పెట్టడం. 

నిర్ధారణ : రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై 

చికిత్స : హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. 

డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, 
ఎండీ (హోమియో) స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ సమస్య తగ్గుతుందా? 
నా వయసు 55 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. డాక్టర్‌ను సంప్రదిస్తే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అన్నారు. హోమియో ద్వారా తగ్గుతుందా? 
– దేవేందర్, నిజామాబాద్‌  

ఈ మధ్యకాలంలో మన రోగనిరోధక శక్తి మన పట్ల ప్రతికూలంగా వ్యవహరించే ఆటోఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడేవారు పెరుగుతున్నారు. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌. సాధారణంగా స్త్రీ–పురుషులలో యాభైఏళ్ళ వయసులో కీళ్ల నొప్పులు మొదలవుతాయి. ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్‌’ అంటారు. అయితే ఇందుకు భిన్నంగా కేవలం  ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ లక్షణాలు.

 దీని లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిపిస్తాయి. వ్యాధి యాక్టివ్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్‌ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

వీటినే ‘డిఫార్మిటీస్‌’ అంటారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్‌ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మియాజ్మాటిక్‌ ప్రిస్క్రిప్షన్‌ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్‌ కిల్లర్స్, స్టెరాయిడ్స్‌ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా కూడా నివారించవచ్చు.

డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

మరిన్ని వార్తలు