Trisha: త్రిషతో బెడ్‌రూమ్‌ పంచుకుందామనుకున్నా.. లియో నటుడు సంచలన కామెంట్స్!

19 Nov, 2023 07:19 IST|Sakshi

నటి త్రిషై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌ చేసిన కామెంట్స్‌పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలసుకుందాం. 

విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మన్సూర్ త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను చేసిన అసభ్యకరమైన కామెంట్స్‌ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. 

మన్సూర్‌ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. కానీ సినిమాలో ఒక్క బెడ్‌రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్‌రూమ్‌కు తీసుకెళ్తానని అనుకున్నా. ఇంతకుముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్‌పై పలువురు తారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నాంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు