ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ : విడిపోము... మనము

10 Apr, 2017 12:19 IST|Sakshi
ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ : విడిపోము... మనము

మాటలలో నిర్వచించలేని అపురూప బంధం స్నేహం. ‘మన స్నేహబంధం పదిలంగా ఉండాలి నేస్తం’  అనే తలంపుతో స్నేహితులు ఒకరికొకరు మణికట్టుపై ‘బంధనాలు’ (ఫెండ్‌షిప్ బ్యాండ్స్) కట్టుకుంటారు. అలా కట్టుకునే బంధనాలూ ఆకట్టుకునేలా మార్కెట్‌ను రకరకాల బ్యాండ్స్ ముంచెత్తుతున్నాయి. వీటిని ఫ్రెండ్‌షిప్ డే రోజునే కాదు రకరకాల అధునాతన దుస్తులను ధరించినప్పుడు బ్రేస్‌లెట్స్ మాదిరిగానూ వాడవచ్చు.
 
 ఈ బ్యాండ్స్‌లో ప్లాస్టిక్‌వి, స్టీల్, సిల్వర్ మెటల్‌తో తయారుచేసినవీ ఉంటున్నాయి. కలర్‌ఫుల్‌గా కనువిందుచేసే ఈ బ్యాండ్స్ రూ. 10 నుంచి లభిస్తున్నాయి. మణికట్టును మురిపించేలా విభిన్నతరహాలో ఆకట్టుకుంటున్న ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కమ్ బ్రేస్‌లెట్ మోడల్స్‌లో ఇవి కొన్ని..

మరిన్ని వార్తలు