తమన్నా తగ్గించేశారా?

25 Dec, 2015 23:12 IST|Sakshi
తమన్నా తగ్గించేశారా?

గాసిప్స్

స్వచ్ఛమైన పాల రంగు, తమన్నా ఒంటి రంగు ఒకటే. అందుకే అందరూ ఆమెను ముద్దుగా ‘మిల్కీ బ్యూటీ’ అని పిలుస్తుంటారు. తెలుగు, తమిళ భాషల్లో ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’గా దూసుకెళుతున్న తమన్నా తీసుకుంటున్న పారితోషికం కోటి రూపాయలకు కాస్త ఎక్కువే అని తెలుస్తోంది. ఇటీవల ‘ధర్మ దురై’ అనే తమిళ చిత్రానికి ఆమె కోటిన్నర డిమాండ్ చేశారని సమాచారం. వరుస విజయాలతో స్టార్ హీరోల వరుసలో చేరిపోయిన విజయ్ సేతుపతి హీరోగా ఈ చిత్రం రూపొందనుంది.

విజయ్ సేతుపతితో పోల్చితే తమన్నా స్థాయి చాలా ఎక్కువ. అందుకేనేమో కోటిన్నర అడిగి ఉంటారని చెన్నై టాక్. దాంతో తమన్నాతో నిర్మాత బేరసారాలు సాగించారట. నేను అడిగింది ఇవ్వాల్సిందేనని మంకు పట్టు పట్టకుండా తమన్నా మెట్టు దిగారట. పారితోషికం తగ్గించుకోవడానికి రెడీ అయిపోయారని వినికిడి. ఓ 20, 30 లక్షలు తగ్గించుకుని ఉంటారేమో అనుకుంటే పొరపాటే. ఏకంగా 50 లక్షల వరకూ తగ్గించుకున్నారని భోగట్టా. బహుశా తమన్నాకు కథ, పాత్ర బాగా నచ్చి ఉంటాయేమో!
 

 

మరిన్ని వార్తలు