మహా గడియారం...

30 Jan, 2016 00:37 IST|Sakshi
మహా గడియారం...

తిక్క లెక్క

గడియారాల్లో రకరకాలు చూసి ఉంటాం. నానా ఫ్యాషన్ల చేతి గడియారాలు, నానా పరిమాణాల గోడ గడియారాలు ఇళ్లలో సామాన్యంగా వాడుతూనే ఉంటాం. నగరాలు, పట్టణాల కూడళ్లలోని క్లాక్‌టవర్లపై నలుదిశలా కనిపించే బండిచక్రం పరిమాణంలోని గడియారాలను చూసినప్పుడు.. అబ్బో..! ఎంత పెద్ద గడియారమో! అని అలవాటుగా ఆశ్చర్యపోతుంటాం. అయితే, వీటన్నింటినీ తలదన్నే మహా గడియారం ఒకటి గిన్నెస్ బుక్‌లోకి ఎక్కింది.

ముస్లింల పవిత్ర నగరమైన మక్కాలో కాబా ఎదురుగా ఉండే అబ్రజ్ అల్‌బైత్ టవర్స్ హోటల్ భవనానికి 601 మీటర్ల ఎత్తున గల పై అంతస్తు గోడలకు నాలుగు వైపులా బయటకు కనిపించేలా అమర్చిన ఈ గడియారం ప్రపంచంలోనే అతిపెద్దది. దీని వ్యాసం ఏకంగా 43 మీటర్లు.
 

 
 

మరిన్ని వార్తలు