క్యాప్సికం, స్ప్రింగ్‌ ఆనియన్స్‌ తాజగా ఉండాలంటే..!

15 Nov, 2023 10:04 IST|Sakshi

కొన్ని రకాల కాయగూరలని ఫ్రిజ్‌లో ఉంచిన  వెంటనే పాడైపోతాయి. ఎలా నిలువ చేయలో అర్థంకాక సతమతమవుతుంటాం. పైగా అవి ఖరీదు కూడా. పోనీ వెంటనే వండటం కుదురుతుందా అంటే ఒక్కొసారి అస్సలు కుదరదు. అలాంటి టైంతో మన పెద్దవాళ్లు లేదా కొందరూ చెఫ్‌లు చెప్పే చిట్కాలు బాగా పనిచేస్తాయి. మన ఇబ్బంది తీరిపోతుంది. అలాంటి కొన్ని ఇంటి చిట్కాలు మీ కోసం..

  • గాజుసీసాలో నీళ్లుపోసి స్ప్రింగ్‌ ఆనియన్స్‌ వేర్లు మునిగేలా పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి. పచ్చని భాగం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్నప్పుడల్లా కాస్త కట్‌ చేసుకోని వాడుకోవచ్చు. 
  • మిగిలిపోయిన బ్రెడ్‌ స్లైసులను మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని దోరగా వేయించి గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. మార్కెట్లో దొరికే బ్రెడ్‌ క్రంప్స్‌లా ఇది ఉపయోగపడుతుంది. క్రిస్పీ వెజ్‌ నాన్‌వెజ్‌ డిష్‌లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
  • క్యాప్సికాన్ని పేపర్‌ బ్యాగ్‌లో చుట్టిపెట్టి, రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటుంది.
  • బేకింగ్‌ సోడాలో కాస్త వెనిగర్‌ వేసి నల్లగా జిడ్డుపట్టిన పాత్రలపైన రాసి పదినిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్‌వాషర్‌తో తోమితే నలుపంతా పోయి పాత్ర కొత్తదానిలా మెరుస్తుంది. 

(చదవండి: దానిమ్మ ఎన్ని వ్యాధులకు చెక్‌పెడుతుందో తెలుసా! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..)

మరిన్ని వార్తలు