థైరాయిడ్‌కు హోమియో చికిత్స

5 Oct, 2013 00:06 IST|Sakshi
థైరాయిడ్‌కు హోమియో చికిత్స

మన శరీరంలో ఉండే గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి అతి ముఖ్యమైన గ్రంథి. దీని ప్రభావం అన్ని జీవవ్యవస్థలపైన ఉంటుంది. ఈ గ్రంథి గొంతు భాగంలో థైరాయిడ్ కార్టిలేజ్ అనే మృదులాస్థి పైన ఉంటుంది.
 
 థైరాయిడ్ గ్రంథి టి -3, టి - 4, టి3-ట్రైఅయోడో థైరాక్సిన్, టి4-థైరాక్సిన్ అని రెండు హార్మోన్‌లు ఉత్పత్తి చేయాలంటే హైపోథైలమస్ పిట్యుటరీ, గ్రంథి నుంచి వచ్చే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టి.ఎస్.హెచ్.) థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరచాలి. థైరాయిడ్ హార్మోన్‌లో అయోడిన్ అనే మూలకం పాత్ర అతి ముఖ్యమైనది.
 
 థైరాయిడ్ హార్మోన్ అన్ని జీవ వ్యవస్థలయిన ...........కార్బోహైడ్రేట్. కొవ్వుపదార్థాల జీవవ్యవస్థలు, బేసల్ మెటబాలిక్ రేట్ (బీఎమ్మార్) శ్వాస వ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, ముఖ్యంగా సంతాన ఉత్పత్తి వ్యవస్థపైన, దీని ప్రభావం ఉంటుంది. పిండదశలోనూ, పుట్టిన తరవాత మొదటి 4- 5 నెలలో దీని ఆవశ్యకత చాలా కీలకమైనది.
 
 హైపోథైలమస్ పిట్యుటరీ థైరాయిడ్ వ్యవస్థలలో మార్పు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి ప్రక్రియలో మార్పులు సంభవించి అధిక (హైపర్ థైరాయిడ్), తక్కువ (హైపోథైరాయిడ్ ) వంటివి వస్తాయి.
 
 కారణాలు:  నేటి మానవ జీవన విధానం ప్రకృతి విరుద్ధంగా ఉండటం, అధిక ఒత్తిడి, సరియైన శారీరక వ్యాయామం లేకపోవడం, పౌష్టికాహార లోపం వలన థైరాయిడ్ వ్యవస్థలో మార్పులు సంభవించి థైరాయిడ్ బారిన పడతారు.  
 
 వంశపారంపర్యంగా థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తాయి  
 
 అయోడిన్ లోపం వలన   
 
 పార్షియల్ థైరాయిడక్టమీ  
 
 పిట్యుటరీ గ్రంథిలో వచ్చే వ్యాధుల వలన కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి.
 
 రకాలు
 1) హైపోథైరాయిడిజం: ఇది సర్వసాధారణంగా కనిపించే థైరాయిడ్ వ్యాధి. శరీరంలో కావలసినదాని కంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఇది వస్తుంది. ఏ వయసులో ఉన్న వారైనా ఈ హైపోథైరాయిడిజానికి గురి కావచ్చు. పిల్లలు, స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
 
 లక్షణాలు
 పిల్లల్లో: బుద్ధిమాంద్యం, ఎదుగుదల లోపం, జ్ఞాపకశక్తి లేకపోవడం, మలబద్దకం, చురుకుదనం కోల్పోవడం, వయసుకి మించి లావుగా ఉండటం.
 
 యుక్తవయస్కులలో: ఒంట్లో నీరు చేరి బరువు పెరగడం, బిఎంఆర్ తగ్గిపోవడం, రజస్వల (మెనార్కి) ఆలస్యం కావడం, ఋతుచక్రం ఆలస్యం కావడం, అమెనోరియా, నెలసరిలో అధిక రక్తస్రావం/ అల్ప రక్తస్రావం ఉండటం, సంతానలేమి, చర్మం పొడిబారడం, వెంట్రుకలు రాలటం, బద్దకంగా ఉండి పనిచేయాలనిపించక పోవడం, చలి తట్టుకోలేకపోవడం.
 
 ఆడవారిలో రోజూ వేసుకునే దుస్తులు, గాజులు బిగుతు కావడం, అల్వికేరియా అనే చర్మ సంబంధిత వ్యాధుల వంటి లక్షణాలతో హైపోథైరాయిడ్‌ను సులువుగా గుర్తించవచ్చు.
 
 2) హైపర్ థైరాయిడజమ్: థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో థైరాక్సిన్‌ను విడుదల చేయడం వలన వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజమ్ అంటారు.
 
 లక్షణాలు : ఆహారం సరియైన మోతాదులో తీసుకున్నా బరువు తగ్గడం, నిద్రలేమి, గుండెదడ, అధిక చెమట, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండటం, నెలసరి త్వరగా రావడం, ఋతుచక్రంలో అధిక రక్తస్రావం జరగడం
 
 3) హషిమోటోస్ థైరాయిడైటిస్: ఇది జీవనక్రియల అసమతుల్యత వలన వచ్చే థైరాయిడ్ (ఆటో ఇమ్యూన్). దీనిలో థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా యాంటీ బాడీస్ ఉత్పన్నమై,  థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పని చేయనివ్వవు. ఇందులో హైపో మరియు హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఉండే అవకాశం ఉంది.
 
 గాయిటర్: థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి కావడాన్ని గాయిటర్ అంటారు. కొన్ని సందర్భాలలో దీని పరిమాణం కంటే రెండింతల పరిమాణం వాపు వచ్చి స్వరపేటిక పైన ఒత్తిడి చేయడం వల్ల వాయిస్‌లో మార్పు వస్తుంది.
 
 గాయిటర్‌లో థైరాయిడ్ హార్మోన్‌లు టి - 3, టి - 4 సాధారణస్థితిలో ఉన్నప్పటికీ గాయిటర్ లేనట్టుగా నిర్థారించలేం.
 
 కారణాలు: అతి ముఖ్యమైన కారణం... అయోడిన్ అనే మూలకలోపం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది.
 గ్రేవ్స్ డిసీజ్
 పిట్యుటరీ గ్రంథి ట్యూమర్స్  
 థైరాయిడ్ క్యాన్సర్
 
 లక్షణాలు
 గొంతు కింద వాపు వచ్చి మింగడానికి కష్టంగా ఉంటుంది  
 స్వరంలో మార్పులు రావడం  
 ఎక్సా ఆప్తల్మిక్ గాయిటర్ అనగా కనుగుడ్లు బయటికి పొడుచుకు వచ్చినట్టుగా ఉండటం  
 టిబియల్ విక్సెడిమా.
 
 నిర్థారణ పరీక్షలు
 థైరాయిడ్ ప్రొఫైల్ టి-3, టి-4, టిఎస్‌హెచ్  
 యాంటీ థైరాయిడ్ యాంటీ బాడీస్  
 యూఎస్ ఈ ఆఫ్ థైరాయిడ్ గ్రంథి
  గొంతు యొక్క సీటీ స్కాన్
 
 హోమియో చికిత్స

 చాలామంది పేషెంట్లకు దీనిపై అవగాహన తక్కువ. థైరాయిడ్‌కు మందులు లేవు, జీవితాంతం థైరాక్సిన్ వాడడం తప్ప మరో మార్గం లేదనుకుంటారు. అదేవిధంగా చాలామందికి హోమియో వైద్యంపై సరియైన అవగాహన లేకపోవడం వల్ల అలా అనుకుంటారు. తాము తీసుకునే థైరాక్సిన్ అనేది ట్రీట్‌మెంట్ కాదు, సప్లిమెంట్ అని తెలియదు.
 
 హోమియో వైద్యంలో రోగి శరీర తత్త్వాన్ని బట్టి సరైన చికిత్స ఇస్తే తప్పక అనతికాలంలో నయం చేయవచ్చును.
 
 హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ రోగి శరీరతత్త్వాన్ని బట్టి జెనిటిక్ కాన్‌స్టిట్యూషన్ సిమిలిమం విధానం ద్వారా హైపోథైలమస్ పిట్యుటరీ థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం వలన థైరాయిడ్ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చును.
 

మరిన్ని వార్తలు