ఎల్‌ఈడీ టీవీ పనిచేసేదిలా.. హౌ ఇట్ వర్క్స్?

29 Nov, 2015 02:17 IST|Sakshi
ఎల్‌ఈడీ టీవీ పనిచేసేదిలా.. హౌ ఇట్ వర్క్స్?

టెలివిజన్... స్మార్ట్‌ఫోన్... ట్యాబ్లెట్... కంప్యూటర్ మానిటర్.. వీటన్నింటిలో కామన్ ఏమిటో చెప్పుకోండి? మీ అంచనా కరెక్టే. ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ డిస్‌ప్లే. ఈ గాడ్జెట్‌లతో మనం రోజంతా గడిపేస్తూంటాం. అటు వినోదం... ఇటు విజ్ఞానమూ పొందుతూంటాం. బాగానే ఉంది. కానీ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే చిత్రాలు ఆ తెరపై ఎలా ప్రత్యక్షమవుతాయో మీకు తెలుసా? ఆ అద్భుతమెలా సాధ్యమవుతోందో చూసేయండి మరి..
 
ప్రతి ఎల్‌ఈడీ డిస్‌ప్లేలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటి బ్యాక్‌లైట్. రెండోది  డిస్‌ప్లే మ్యాట్రిక్స్. బ్యాక్‌లైట్ కోసం ఎల్‌ఈడీలు ఉపయోగిస్తే అది ఎల్‌ఈడీ టీవీ, కోల్డ్ కాథోడ్ ఫ్లోరసెంట్ ల్యాంప్‌ను వాడితే అది ఎల్‌సీడీ. లైట్ పోలరైజేషన్ అన్న భౌతిక సిద్ధాంతం ఆధారంగా డిస్‌ప్లే మ్యాట్రిక్స్ పనిచేస్తుంది. వీడియో చిత్రాల తాలూకూ సమాచారం రేడియో తరంగాల రూపంలో తీగల గుండా ప్రయాణిస్తాయి.

ధ్వని సంకేతాలన్నీ ఆడియో సర్క్యూట్ ద్వారా లౌడ్‌స్పీకర్‌లోకి ప్రయాణించి శబ్దాలు వినిపించేలా చేస్తే... వీడియో సంకేతాలు మన టీవీ తెరపై ఉండే పిక్చర్ ఎలిమెంట్స్ లేదా పిక్సెళ్ల గుండా ప్రయాణిస్తాయి. ఈ పిక్సెళ్ల మధ్యభాగంలో ఉండే లిక్విడ్ క్రిస్టల్స్ ప్రవహించే విద్యుత్తును బట్టి ఏ రకమైన కాంతి ప్రసారం కావాలో నిర్ణయిస్తాయి. స్క్రీన్‌పై ఉండే వేలాది పిక్సెళ్లలో ఈ ప్రకియ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో వీడియో సంకేతాలు దృశ్యంగా మారి మనకు తెరపై కనిపిస్తాయి.

మరిన్ని వార్తలు