చెత్తతో రబ్బరుకు మెరుగైన లక్షణాలు! 

2 May, 2018 00:32 IST|Sakshi

ఆహార వ్యర్థాలను ఎరువులుగా మార్చడం గురించి మనకు చాలాకాలంగా తెలుసు. చెత్త నుంచి ఇంతకంటే మేలైన ప్రయోజనాలు చేకూరితే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇదే పని చేస్తోంది ఓ సంస్థ. ఆహార వ్యర్థాలు కుళ్లిపోయే క్రమంలో వెలువడే వాయువులను ఉపయోగించుకుని మెరుగైన ఎలక్ట్రానిక్‌ సీలెంట్లు, సెన్సర్లను తయారుచేయవచ్చునని  కంపెనీ గుర్తించింది. హెవియా బ్రాసిలినిసిస్‌ అనే చెట్టు కాండానికి గాట్లు పెట్టి సేకరించే పాలను శుద్ధి చేయడం ద్వారా రబ్బరు తయారవుతుందని మనకు తెలుసు.

కార్బన్‌ బ్లాక్‌ను కలిపి రబ్బరును కాళ్లకు తొడుక్కునే బూట్ల నుంచి అనేక ఇతర వస్తువులను తయారుచేస్తారు. ఇలా కలపడం వల్ల దాని లక్షణాలు పెరుగుతాయని అంచనా. కానీ పర్యావరణానికి కొంత నష్టం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆహార వ్యర్థాల నుంచి వెలువడే మిథేన్‌ను వాడవచ్చునని అలైన్‌ ప్నికాడ్‌ అనే శాస్త్రవేత్త అంటున్నారు. మిథేన్‌ సాయంతో ఉత్పత్తి చేసే నానోగ్రాఫైట్‌ రేణువులను రబ్బరుతో కలిపినప్పుడు అది విద్యుత్తును బాగా నిరోధిస్తుందని తెలిసింది. అందువల్ల దీన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో సీలెంట్‌గా వాడవచ్చునని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు