సూపర్ హిట్ ప్యార్ ఝక్తా నహీ...

5 Oct, 2015 00:46 IST|Sakshi
సూపర్ హిట్ ప్యార్ ఝక్తా నహీ...

ఫ్లాపుల్లో ఉన్న మిథున్ చక్రవర్తిని మళ్లీ నిలబెట్టిన సినిమా ఇది. ప్రేమ జంట విడిపోయి తమకు పుట్టిన పిల్లాడి ద్వారా కలవడం గతంలో ‘ఆ గలే లగ్ జా’ (1973- తెలుగులో మంచి మనసులు) వంటి కథల ద్వారా చూసినా అదే కథ కొంచెం మార్పుచేర్పులతో ప్రేక్షకులను అలరించింది. పేదవాడైన హీరో, కలవారి అమ్మాయి... వారి మధ్య కొందరు అడ్డు పడటం.. ఇంతే కథ. అయితే మిథున్, పద్మిని కొల్హాపురి జంట ప్రేక్షకులకు నచ్చింది. అంతేకాదు సినిమాను లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం నిలబెట్టింది.

‘తుమ్ సే మిల్ కర్... నా జానే క్యూ’... పాట రేడియోలో మోగిపోయింది. 1985లో రిలీజైన ఈ సినిమా సంవత్సరం రోజులు ఆడటం ఆప్పట్లో ఆషామాషీ కాదు. దీని ప్రభావం దక్షిణాదిన పడింది. తమిళంలో రజనీకాంత్, కన్నడలో విష్ణువర్థన్ దీని రీమేక్‌లలో నటించారు. తెలుగులో ‘పచ్చని కాపురం’ పేరుతో కృష్ణ, శ్రీదేవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పట్లో ఎస్.పి.బాలు, కృష్ణల మధ్య స్పర్థలు ఉండటంతో ఇందులోని పాటలు కె.జె. ఏసుదాస్ గళంలో వినిపిస్తాయి. ‘వెన్నెలైనా చీకటైనా’... పాట ఇప్పటికీ హిట్టే.
 
 

మరిన్ని వార్తలు