నన్నడగొద్దు ప్లీజ్‌

9 Nov, 2017 23:28 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌..! నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజనేర్‌ని. నేను చిన్నప్పటి నుంచి మా అత్త కూతురిని ప్రేమిస్తున్నా. తను కూడా నన్ను లవ్‌ చేసింది. బట్, తను ఎప్పుడైతే బీటెక్‌లో జాయినయ్యిందో అప్పటి నుంచి నాతో కేర్‌లెస్‌గా ఉంటోంది. ఏంటని అడిగితే తను ఇంకొకరిని లవ్‌ చేస్తున్నా అని చెబుతోంది. ఆ అబ్బాయి గురించి వాళ్ల ఫ్రెండే చెడ్డగా చెబుతుంది. అదే విషయం తనకి చెబుతుంటే ‘‘నీకు అనవసరం!’’ అంటోంది. పోనీ, లవ్‌ చేసిన ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటావా? అని అడిగితే క్లారిటీ ఇవ్వడం లేదు. తను ఎవరిని లవ్‌ చేసినా... సరే.. తను నా దగ్గరకు వచ్చి ‘‘నన్ను మ్యారేజ్‌ చేసుకో’’ అని అడిగితే చేసుకుంటా. అంత ఇష్టం తనంటే నాకు. కానీ నా ప్రేమ తనకి అర్థం కావడంలేదు. నేను ఏం చెయ్యాలి? – నాగ్‌రాజ్‌
పుట్టలో పాలు పోస్తే? ‘ఏంటి సార్‌ మీరు నాగ్‌రాజ్‌ని స్నేక్‌తో పోలుస్తున్నారు..!?’ ఏ పుట్టలో ఏ దిల్‌ ఉందో? ‘దిల్‌ అంటే ఏంటి సార్‌??’ అదే కాదల్‌ దిల్‌!!‘సార్‌ కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు సార్‌!’
కాదల్‌ అంటే లవర్‌..! దిల్‌ అంటే హృదయం..!!‘కాదల్‌.. దిల్‌... ఇన్‌ ది పుట్ట..!?! అంటే ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి సార్‌!!’ఏ పుట్టలో ఏ ప్రేమికుడి హృదయం ఉందో ఎవరికి తెలుసు నీలూ!?‘ఈ కొటేషన్లకి నాగ్‌రాజ్‌ మరదలు లవ్‌ స్టోరీకి ఏంటి సార్‌ కనెక్షన్‌??’నాకు తెలిసి అమ్మాయికి ఎవరంటే కూడా అంత ఇష్టం ఏమీ లేదు!‘మరి నాగ్‌రాజ్‌ని ప్రేమించి సడన్‌గా.. చల్‌ హట్‌..!! టేక్‌ ఏ వాక్‌..!! పో రా పో..!!  అని ఎందుకు అంది సార్‌?’ప్రేమ మీద విరక్తి కలిగి..! ప్రేమ నుంచి దూరంగా ఉండాలని..! కొంచెం స్పేస్‌ కావాలని..! నాగ్‌రాజ్‌ ప్రేమలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి గాలి ఆడక..! అలా తప్పించుకోవడానికి చెప్పింది...!!!!‘అబ్బా..! నాగ్‌రాజ్‌ చెవిలో ఏమైనా పూలు కనబడుతున్నాయా సార్‌..? నాగ్‌.. ఒట్టి శుంఠ అనుకుంటున్నారా సార్‌.. కథలు చెబుతున్నారు? మీ సిస్టర్‌కి బ్యాడ్‌ నేమ్‌ రాకూడదని అంతగా కవరింగ్‌ చేస్తున్నారు.. మీ చెల్లెలు ఉడాయించేసింది సార్‌.. పాపం నాగ్‌రాజ్‌ ఏమి చెయ్యాలో చెప్పండి...!’ ఓపిక పట్టాలి..!!

‘ఏదో ఇంకో అమ్మాయిని పట్టాలి..! అన్నట్టు చెబుతున్నారేంటి సార్‌?’ పట్టాలి.. ఓపిక పట్టాలి.. లవ్‌ మీద నమ్మకం పెట్టాలి..! ‘సార్‌ దండం పెడ్తా..! క్లియర్‌గా చెప్పండి.. సార్‌...!?!’ నీ సుఖమే నే కోరుకున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా.. న్నా.. న్నా.. నీ సుఖమే నే కోరుకున్నా...! ‘అని అమ్మాయి పాడిందా సార్‌..? లేక అబ్బాయిని పాడమంటున్నారా?’ ఎవరో ఒకరు పాడితే ఇద్దరూ సుఖంగా ఉంటారు కదా నీలూ..!? ‘ఏ పుట్టలో ఏ అరటిపండు ఉందో...!!’ అని నీలు పాట అందుకుంది నాకు అరటిపండు ఇవ్వకుండా!!
-  ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ,  సాక్షి టవర్స్, రోడ్‌ నంబర్‌ 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు