లవ్వు బువ్వ

13 Feb, 2015 22:36 IST|Sakshi
లవ్వు బువ్వ

లవ్ లెటర్స్
 
కావలసినవి: మైదా పిండి - 2 కప్పులు; పంచదార - అర కప్పు; ఉప్పు - టీ స్పూను; బటర్ - కప్పు; నిమ్మతొక్కల తురుము - 2 టీ స్పూన్లు; కమలాపండు తొక్కల తురుము - టేబుల్ స్పూను; సోర్ క్రీమ్ - అర కప్పు; చెర్రీ ముక్కలు - కప్పు; పంచదార పొడి - 4 టీ స్పూన్లు

తయారీ:  475 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి  ఒక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు వేసి కలపాలి  బటర్, నిమ్మతొక్కల తురుము, కమలాపండ్ల తొక్కల తురుము వేసి బాగా కలపాలి  సోర్ క్రీమ్‌ను గిలక్కొట్టి జత చేయాలి  అన్నీ బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేయాలి  ఒక్కో ఉండను ఒత్తి, ఎన్‌వలప్ కవర్‌లా మడిచి, మధ్య భాగంలో చెర్రీ ఉంచాలి  బేకింగ్ షీట్ మీద ఒక్కో కవరును జాగ్రత్తగా ఉంచాలి  పై భాగం మీద నీళ్లను బ్రష్ చేసి, పంచదార చల్లి, సుమారు ఎనిమిది నిమిషాలు బేక్ చేసి తీసేయాలి.
 
స్వీట్ హార్ట్
 
కావలసినవి: వైట్ కేక్ మిక్స్ - ఒక ప్యాకెట్; నీళ్లు - 1 + 1/4 కప్పులు; వెజిటబుల్ ఆయిల్ - 1/3 కప్పు; కోడిగుడ్లు - 3 (తెల్ల సొన మాత్రమే వాడాలి); రెడ్ ఫుడ్ కలర్ - 8 చుక్కలు; రాస్ప్‌బెర్రీ క్యాండీ ఆయిల్ - 2 చుక్కలు
 
తయారీ:  అవెన్‌ను 350 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేయాలి  మఫిన్ టిన్‌లో పేపర్ కప్ కేక్ లైనర్లు ఉంచాలి  ఒక పాత్రలో కేక్ మిక్స్, నీళ్లు, వెజిటబుల్ ఆయిల్, కోడిగుడ్ల తెల్ల సొన వేసి బాగా గిలక్కొట్టాలి  కప్ కేక్‌లో మూడు వంతుల మిశ్రమం వే సి పక్కన ఉంచాలి  మిగిలిన మిశ్రమంలో నాలుగు చుక్కల రెడ్ ఫుడ్ కలర్ వేసి కలిపాక, రాస్ప్‌బె ర్రీ ఆయిల్ వేసి, 1/3 వంతు మిశ్రమంలో పింక్ రంగు మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి పక్కన ఉంచాలి  మిగిలిన మిశ్రమంలో రెట్టింపు ఫుడ్ కలర్ నీళ్లు వేసి, మిశ్రమాన్ని మరో ప్లాస్టిక్ కవర్‌లో వేసి పక్కన ఉంచాలి  లేత గులాబీ రంగు మిశ్రమం ఉన్న కవర్‌ను కోన్‌లా పట్టుకుని చివర్లు కట్ చేసి రెండు మిశ్రమాలను కప్ కేక్‌ల మధ్య భాగంలో రెండు టీ స్పూన్ల మిశ్రమం వచ్చేలా గట్టిగా పిండాలి  ముదురు గులాబీ రంగులో ఉండే మిశ్రమం ఉన్న కవర్‌ను కూడా అదేవిధంగా కట్ చేసి టీ స్పూను మిశ్రమం వచ్చేలా గట్టిగా పిండాలి  ఈ కప్ కేక్‌లను అవెన్‌లో ఉంచి సుమారు 20 నిమిషాల సేపు బేక్ చేసి బయటకు తీసి చల్లారనివ్వాలి  ఫ్రిజ్‌లో ఉంచి కొద్దిగా చల్లబడ్డాక అందించాలి.
 
సుగర్ లిప్స్

 
కావలసినవి: బటర్ - ఒకటిన్నర కప్పులు; పంచదార - 2 కప్పులు; కోడిగుడ్లు - 4; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ - టీ స్పూను; మైదా పిండి - 5 కప్పులు; బేకింగ్ సోడా - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత
 
తయారీ: ఒకపెద్ద పాత్రలో బటర్, పంచదార వేసి బాగా మెత్తగా క్రీమీగా అయ్యేవరకు గిలక్కొట్టాలి  కోడిగుడ్లు, వెనిలా వేసి బాగా గిలక్కొట్టి, మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు మిశ్రమానికి జత చేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఒకరోజు రాత్రంతా ఉంచాలి  అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేయాలి  ఫ్రిజ్‌లో నుంచి మిశ్రమాన్ని బయటకు తీసి, సుమారు పావు అంగుళం మందంగా ఒత్తి, కుకీ కటర్‌తో కావలసిన ఆకారంలో కట్ చేసి, అన్ గ్రీజ్‌డ్ కుకీషీట్ మీద ఉంచి, సుమారు ఎనిమిది నిమిషాలు వుంచి తీసి, చల్లారాక అందించాలి.
 
 

మరిన్ని వార్తలు