ఒళ్లు పెరిగితే.. మానసిక సమస్యలు... 

27 Sep, 2018 00:24 IST|Sakshi

మీరు చదివింది నిజమే. బ్రిస్టల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ తెలుసుకున్నారీ విషయాన్ని. బాడీ మాస్‌ ఇండెక్స్‌.. అదేనండి..మన ఎత్తుకు, బరువుకు ఉన్న నిష్పత్తి ఎక్కువైతే మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి అని వీరు అంటున్నారు. ఊబకాయంతో ఆరోగ్య సమస్యలు ఎక్కువన్న విషయం మనకు తెలిసిందే. బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం శరీరం బరువు, గుండె ఆరోగ్యం, రక్తపోటు వంటి అంశాలకు మానసిక సమస్యలకూ సంబంధం ఉంది.

అయితే ఆరోగ్య సమస్యలతో మానసిక సమస్యలు వస్తాయా? లేదా మానసిక సమస్యలు వచ్చిన తరువాత ఆరోగ్య సమస్యలు మొదలవుతాయా? అన్నది మాత్రం స్పష్టం కాలేదు. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా బాడీ మాస్‌ ఇండెక్స్‌ విషయంలో మాత్రం మానసిక సమస్యలు వస్తాయని తమ అధ్యయనంలో తేలిందని రాబిన్‌ వుట్టన్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో దాదాపు మూడు లక్షల మంది వివరాలను పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఊబకాయంతో ఉన్న వారు ఆత్మనూన్యతతో బాధపడుతూండటం ఇందుక కారణం కావచ్చునని చెప్పారు. 
 

మరిన్ని వార్తలు