అయ్యయ్యో.. ఆ యోగం లేదయ్యో!

28 Nov, 2017 01:13 IST|Sakshi

ఉత్సాహంగా ఉరకలేసే పాల పొంగు మీద నీళ్లు చల్లినట్లు... కంటికి కనిపించనంత ఎత్తుకి ఎగురుతుందనుకున్న తారాజువ్వ తుస్సుమన్నట్లు... అజిత్‌ అభిమానులకు ఓ న్యూస్‌. వాళ్లకు ఇది గుడ్‌ న్యూస్‌ కాదండోయ్‌. మనోడు తెలుగోడైనా తమిళంలో మంచి ఫాలోయింగ్‌ తెచ్చేసుకున్నాడు. అక్కడ ‘రియల్‌ హీరో’ లెక్క. బోలెడన్ని దానధర్మాలు చేస్తాడు. రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రం బాగుపడటం గ్యారంటీ అనే పేరు కూడా ఉంది. ఫ్యూచర్‌లో అది కూడా జరుగుతుందని ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు.

ఇంతలో ఓ జ్యోతిష్యుడు... ఈయనగారికి మాంచి పేరుంది. చెప్పింది 90 పర్సెంట్‌ అయినా జరుగుతుందట. ఈ జ్యోతిష్యులుంగారు.. అజిత్‌కి ఆ యోగం లేదని చెప్పేశారు. అదేనండీ.. రాజకీయ యోగం లేదట. ప్చ్‌.. మనోడు రాజకీయాల్లోకి వచ్చే చాన్స్‌ 90 పర్సెంట్‌ కూడా అతని జాతకంలో కనిపించడంలేదని సదరు పండితుడు తేల్చి చెప్పారు. దాంతో ఫ్యాన్స్‌ అయ్యయ్యో.. అని మొత్తుకుంటున్నారు. బ్యాడ్‌లో గుడ్‌ అన్నట్లు.. ఇంకొన్నేళ్ల పాటు సిన్మా ఇండస్ట్రీలో అజిత్‌కి తిరుగుండదని సెలవిచ్చారట. పోన్లే.. ఈ యోగం అయినా ఉంది కదా అని అభిమానులు మనసుకి సర్ది చెప్పుకుంటున్నారు.

మరిన్ని వార్తలు