తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి బ్రెస్ట్‌ ఇంప్లాంట్..! వైద్య చరిత్రలోనే తొలిసారి

10 Nov, 2023 17:18 IST|Sakshi

ఇంతవరకు మహిళలు తమ అందం కోసం లేదా ఇతర కారణాల వల్ల బ్రెస్ట్‌ ఇంప్లాంట్‌ చేయాల్సి వస్తుంటుంది. కానీ ఇలా ఓ మనిషి ప్రాణాన్ని రక్షించడానికి కూడా ఓ వ్యక్తికి బ్రెస్ట్‌ ఇంప్లాంటేషన్‌ చేయాల్సి వచ్చింది. వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ప్రక్రియను నిర్వహించారు. ఇంతకీ ఎందువల్ల ఇలా చేశారు ఏంటీ ? తదితరాల గురించి చూద్దాం!

అమెరికాలో సెయింట్‌ లూయిస్‌కు చెందిన 34 ఏళ్ల డేవీ బాయర్‌ తనకున్న చెడు అలవాట్ల కారణంగా రెండు ఊపిరితిత్తులు దారుణంగా పాడైపోయాయి. ఎంతలా అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కి గురై చీముతో నిండి ఉన్నాయి. అతడు 21 ఏళ్ల వయసు నుంచే రోజూకి ఒక సిగరెట్‌ ప్యాకెట్‌ తాగేసేవాడు. ఆ దురఅలవాటే అతడి ఊపిరితిత్తులను పూర్తిగా హరించేశాయి. చివరికి తీవ్రమైన ఫ్ల్యూతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు.

పలు వైద్య పరీక్షలు చేయగా అతని ఊపిరితిత్తులు దారుణంగా పాడైనట్లు గుర్తించారు. దీంతో ఎంత వరకు ఇన్ఫెక్షన్‌కు గురయ్యాయని ఎక్స్‌రే తీసి చూడగా..ఇంకేమి మిగిలి లేదని తేలింది. ఆ ఊపిరితిత్తులు పూర్తిగా ద్రవంలా మారిపోవడం ప్రారంభించాయని గుర్తించారు. దీంతో అతడికి తక్షణమే ఊపిరితిత్తుల మార్పిడి చేయక తప్పదని నిర్ణయించారు వైద్యులు. ఇదొక్కటే మార్గమని లేకపోతే ప్రాణాలతో రక్షించటం అసాధ్యమని అతనికి తెలిపారు.

అతని ఇన్ఫెక్షన్‌ క్లియర్‌ చేసేలా రెండు ఊపిరితిత్తులను తొలగించి కృత్రిమ ఊపిరితిత్తులను (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ లేదా ECMO, అవసరమైన వారికి శ్వాసకోశ మద్దతులో భాగంగా) ఉపయోగించారు. అదే టైంలో అతని గుండె పదిలంగా ఉండి సజీవంగా ఉండాలంటే..ఛాతీ కుహరంలో డీడీ బ్రెస్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయ‍క తప్పలేదు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..అతని ప్రాణాలను రక్షించడం కోసం వైద్య సదుపాయంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రక్రియ నిర్వహించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

(చదవండి: పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..)


 

మరిన్ని వార్తలు