డిసెంబర్ 12న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

11 Dec, 2015 23:25 IST|Sakshi
డిసెంబర్ 12న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
 షావుకారు జానకి (నటి), రజనీకాంత్ (నటుడు), యువరాజ్ సింగ్ (క్రికెటర్)
 
 ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య కాబట్టి మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఐశ్వర్యం కలిగి ఉంటారు. కష్టపడే మనస్తత్వం ఉండటం వల్ల కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. భోగభాగ్యాలు అనుభవిస్తారు. పుట్టిన తేదీ 12 అంటే 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి జన్మతః మంచి మేధోవికాసం, ధారణ శక్తి, విషయ పరిజ్ఞానం కలిగి ఉంటారు. బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఈ సంవత్సరం తప్పక ఫలిస్తుంది.
 
  పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. బుధ, గురుల కలయిక వల్ల ఆగిపోయిన చదువును పూర్తి చేయడం, కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం లేదా కొత్త కోర్సులు చేయడం వంటి పరిణామాలు జరగవచ్చు. నెమ్మదిగా నడుస్తున్న ప్రాజెక్టులు వేగవంతం కావడమో, లాభాల బాటలో పడటమో జరుగుతుంది. ఉద్యోగులు వ్యాపారాన్ని లేదా కొత్తప్రాజెక్టుని ఆరంభిస్తారు. ఈ సంవత్సరం తీసుకునే నిర్ణయాలు జీవితంలో మంచి ప్రభావాన్ని చూపుతాయి. 
 
 అయితే ప్రేమవ్యవహారాలు మాత్రం అనుకూలించవు. లక్కీ నంబర్స్: 1,5,6,9; లక్కీ కలర్స్: గ్రీన్, ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: బుధ, గురు, శుక్ర, ఆదివారాలు. సూచనలు: విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, తోబుట్టువులకి, పెళ్లికాని కన్యలకి తగిన సాయం చేయడం, మతగ్రంథాలను పఠించడం, యోగ, ధ్యానం చేయడం, గురువులను గౌరవించడం మంచిది. నరాల బలహీనత, లో బీపీ బాధించే అవకాశం ఉన్నందువల్ల సమయానికి తిండి, నిద్ర ఉండేలా చూసుకోవడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 
Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా